సినిమా

Tollywood: కెప్టెన్ కుర్చీ అంత ఈజీ కాదు..చాలా హీటుంటుంది..

రచన: Anshu•••4 నిమిషాల పఠనం

Tollywood: కెప్టెన్ కుర్చీ అంత ఈజీ కాదు..చాలా హీటుంటుంది..అవును. దర్శకుడి పని ఎంత ఒత్తిడితో కూడుకున్నదో అది ఆ కుర్చీలో కూర్చున్న వాళ్ళకే తెలుస్తుంది. అందుకే, అందరూ హీరోలు డైరెక్షన్ చేయడానికి సాహసించరు. అందరు దర్శకులూ హీరోలా మారడానికి డేర్ చేయరు. ఇలా, చేయడం వల్ల కొన్ని లాభాలుంటే, కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి.

Tollywood: కెప్టెన్ కుర్చీ అంత ఈజీ కాదు..చాలా హీటుంటుంది..అవును. దర్శకుడి పని ఎంత ఒత్తిడితో కూడుకున్నదో అది ఆ కుర్చీలో కూర్చున్న వాళ్ళకే తెలుస్తుంది. అందుకే, అందరూ హీరోలు డైరెక్షన్ చేయడానికి సాహసించరు. అందరు దర్శకులూ హీరోలా మారడానికి డేర్ చేయరు. ఇలా, చేయడం వల్ల కొన్ని లాభాలుంటే, కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి.

కమల్ హాసన్:

సౌత్ సీనియర్ సూపర్ స్టార్ కమల్ హాసన్ దర్శకుడు, రచయిత, నిర్మాత, నటుడు. ఇన్ని పాత్రలను పోషించగల సత్తా ఉన్న కమల్, ఎన్నో సాహసాలు చేశారు. రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిలింస్ బ్యానర్ మీద, ఆయన సినిమాలను నిర్మించాడు. దర్శకత్వం వహించి, నటించాడు కూడా. కానీ, ఈ టాస్క్ అందరికీ సాధ్యపడదు. ప్రస్తుతం కమల్, రజినీకాంత్ హీరోగా సినిమాలను నిర్మిస్తున్నాడు.

మన టాలీవుడ్ స్టార్స్ కూడా మెగా ఫోన్ పట్టారు:

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'జానీ' సినిమాను డైరెక్ట్ చేసి హీరోగా నటించాడు. ఈ సినిమా ఫలితం అందరికీ తెలిసిందే. కానీ, పవన్ కళ్యాణ్ కెరీర్‌లో ఇదొక గొప్ప అనుభవం. ఇక, పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌లో సినిమాలను నిర్మిస్తున్నాడు. త్వరలో, 'ఓజీ 2' సొంత బ్యానర్‌లోనే రూపొందనుంది. దర్శకుడిగా సుజీత్ వ్యవహరించనున్నాడు.

రామ్ పోతినేని:

'ఆంధ్రాకింగ్ తాలూకా' సినిమాలో పాట రాసిన రామ్ పోతినేని ఇప్పుడు ఏకంగా సినిమానే డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా కథ-కథనాలతో పాటు హీరోగా నటిస్తూ కెప్టెన్ కుర్చీలోనూ కూర్చొని యాక్షన్ కట్ చెప్తున్నాడు. కానీ, మొదటిసారి ఇలా రెండు పడవల మీద ప్రయాణం కాస్త రిస్కే అయినా..అందుకు, ధైర్యం చేయడం గొప్ప విషయం. కాకపోతే, హీరోగా కెమెరా ముందు ఉన్నప్పుడు సరైన జడ్జ్‌మెంట్ ఇవ్వగలిగే టీమ్ పక్కన ఉండాలి. రామ్ లాగే, కిరణ్ అబ్బవరం కూడా ఓ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ జాబితాలో ముందే ఉన్నాడు విశ్వక్ సేన్.

అయితే, ఒకవైపు దర్శకత్వం చేస్తూ.. ఇంకోవైపు హీరోగా నటించడం, మిగతా పాత్రలను తీర్చి దిద్దటం, టెక్నికల్ టీమ్ ని మ్యానేజ్ చేయడం, రిలీజ్ సమయంలో డిస్ట్రిబ్యూషన్ చూసుకోవడం, సినిమా బిజినెస్ వ్యవహరాలను బ్యాలెన్స్ చేయడం కత్తి మీద సాము అని చెప్పక తప్పదు. మరి, మన యంగ్ హీరోలు ఇప్పుడు, ఎందుకు కెప్టెన్ కుర్చీలో కూర్చొని హీటెక్కిపోతున్నారో.

వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి