Prabhas-Fauzi: నేడు (ఆగస్టు 15) స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా ఫౌజీ నుంచి సరికొత్త పోస్టర్‌ను వదిలింది టీమ్. ఈ పోస్టర్‌లో ప్రభాస్ మొత్తం రక్తంతో తడిసి ఉన్నాడు. దీంతో, సినిమాలో హింస, రక్తపాతం మోతాదుకి మించి ఉండబోతుందని మేకర్స్ హింట్ ఇచ్చారని అర్థమవుతోంది. మొత్తానికి, తాజా పోస్టర్ సోషల్ మీడియాలో డార్లింగ్ ఫ్యాన్స్ బాగా వైరల్ చేస్తున్నారు.
హను రాఘపూడి దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేస్తున్న ఫౌజీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ కోకాపేటలో వేసిన భారీ ఛార్మినార్ సెట్స్‌లో చిత్రీకరణ జరుగుతోంది. తాజాగా, రిలీజ్ చేసిన పిక్ ఈ సెట్స్‌లో షూటింగ్ జరుగుతున్న ఆన్‌సెట్స్ పిక్కే. ఇంతకముందు వచ్చిన పోస్టర్‌ను ఇటీవల ఇన్స్టా డీపీగా పెట్టాడు ప్రభాస్. ఇప్పుడు, రిలీజ్ చేసిన పిక్ సినిమా ఏ రేంజ్‌లో ఉండబోతుందో ఊహించడానికి కూడా కష్టంగా ఉంది.
ఇదొక పీరియాడికల్ సినిమా అని దర్శకుడు హను రాఘవపూడి ముందే చెప్పాడు. ఆర్మీ ఆఫీసర్ పాత్రలో ప్రభాస్ నటిస్తున్నాడు. అయితే, ఆయన రోల్‌లో డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయని ఒంటిపై ఉన్న జంధ్యం చూస్తే అర్థమవుతోంది. అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీమూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇమాన్వీ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే, డిసెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా ఫౌజీ వస్తుందని కన్‌ఫర్మ్ చేశారు. తాజాగా వదిలిన పోస్టర్‌లోనూ ఇదే విషయాన్ని కన్‌ఫర్మ్ చేశారు.
ఇక, ఈ సినిమాతో పాటు ప్రభాస్ స్పిరిట్ కూడా చేస్తున్నాడు. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహిస్తున్నాడు. ఫౌజీ కోసం స్పిరిట్ చిత్రానికి ప్రస్తుతం బ్రేక్ ఇచ్చారు. ఈ ఆగస్టు మొత్తం ఫౌజీ షూటింగ్‌లోనే ప్రభాస్ పాల్గొంటాడు. దీంతో ఆయనకి సంబందించిన షూట్ మొత్తం కంప్లీట్ అవుతుంది. వచ్చే నెల నుంచి మళ్ళీ నాన్ స్టాప్‌గా స్పిరిట్ షూటింగ్‌లో జాయిన్ కానున్నాడు. వచ్చే ఏడాది మార్చ్ 5న ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు.


