సినిమా

Chiru-Nag-Venkey-Balayya: సీనియర్ల సేఫ్ గేమ్..ఆడినంతవరకూ బాగానే ఉంటుంది!

రచన: Anshu••5 నిమిషాల పఠనం

Chiru-Nag-Venkey-Balayya: యంగ్ హీరోలు చేస్తున్నన్ని సాహసాలు మన సీనియర్ స్టార్ హీరోలు చేయడానికి కాస్త ఆలోచిస్తున్నట్టే కనిపిస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక్క సినిమా ఫ్లాపైతే, ఆ ప్రభావం తర్వాత సినిమాపై గట్టిగానే ఉంటోంది. మళ్ళీ, కథ ఎంచుకోవాలంటే ఒకవైపు అభిమానులను.. ఇంకోవైపు నిర్మాతలను దృష్టిలో పెట్టుకొని ఓకే చెప్పాలి.

Chiru-Nag-Venkey-Balayya: యంగ్ హీరోలు చేస్తున్నన్ని సాహసాలు మన సీనియర్ స్టార్ హీరోలు చేయడానికి కాస్త ఆలోచిస్తున్నట్టే కనిపిస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక్క సినిమా ఫ్లాపైతే, ఆ ప్రభావం తర్వాత సినిమాపై గట్టిగానే ఉంటోంది. మళ్ళీ, కథ ఎంచుకోవాలంటే ఒకవైపు అభిమానులను.. ఇంకోవైపు నిర్మాతలను దృష్టిలో పెట్టుకొని ఓకే చెప్పాలి.

ప్రస్తుతం, మన సీనియర్ స్టార్ హీరోలైన మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేష్, గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ ఒకే తరహాలో సినిమాలను, దర్శకులను ఎంచుకుంటున్నట్టుగా కనిపిస్తోంది. ఒకరకంగా రిస్క్ లేకుండా సేఫ్ గేమ్ ఆడుతూ హిట్స్ కొడుతున్నారు. ముఖ్యంగా, హిట్ ఇచ్చిన దర్శకుడినే లైన్‌లో ముందు ప్రయారిటీ ఇస్తున్నారు.

చిరు-బాబి కాంబోలో మెగా 158 (కదిరి):

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కాంబినేషన్‌లో ఇంతకముందు 'వాల్తేరు వీరయ్య' వచ్చి భారీ కమర్షియల్ హిట్‌గా నిలిచింది. దాంతో, మెగా 158 కథ వినడానికి చిరు వెంటనే టైమిచ్చి..నచ్చగానే వెంటనే రెడీ అయిపోయాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. సంక్రాంతికి బరిలో దిగే అవకాశం ఉంది. అలాగే, టాలెంటెడ్ డైరెక్టర్ దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెలతో చిరు ఓ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

బాలయ్య-గోపీచంద్ మలినేని కాంబో:

'వీర సింహారెడ్డి' సినిమాతో బాలయ్యకి మాసివ్ హిట్ ఇచ్చాడు యాక్షన్ చిత్రాల దర్శకుడు గోపీచంద్ మలినేని. ఇప్పుడు వీరిద్దరు కలిసి 'ఎన్‌బీకే 111' చేస్తున్నారు. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుగుతున్న సమయంలో బాలయ్య గాయపడి బ్రేక్ పడింది. దీనితో పాటు కొరటాల శివ సినిమా, తమిళ దర్శకుడు అధిక్ రవిచంద్రన్ తోనూ ఓ సినిమా చేయడానికి బాలయ్య ఒకే చెప్పాడని అంటున్నారు.

వెంకీ-అనిల్‌లది హిట్ కాంబో:

టాలీవుడ్‌లో ఇప్పుడు బాగా ఫాంలో ఉన్న కాంబో వెంకటేష్-అనిల్ రావిపూడిలది. 'ఎఫ్ 2', 'ఎఫ్ 3', 'సంక్రాంతికి వస్తున్నాం', 'మన శంకరవరప్రాద్‌గారు' సినిమాలతో వెంకీకి మంచి హిట్స్ ఇచ్చాడు అనిల్. ఇప్పుడు వెంకీ, కళ్యాణ్ రామ్ లతో మల్టీస్టారర్ చేస్తున్నాడు. అలాగే, 'సైంధవ్' డైరెక్టర్ శైలేష్ కొలనుకి మరో ఛాన్స్ ఇచ్చినట్టు తెలుస్తోంది.

నాగార్జున మాత్రం చాలా ప్రత్యేకం:

టాలీవుడ్ సీనియర్ హీరోలలో అక్కినేని నాగార్జున చాలా ప్రత్యేకం. ప్రయోగాలు చేయడానికి ముందుంటాడు. కొత్తవాళ్ళని పరిచయం చేయాలంటే కింగ్ తర్వాతే ఎవరైనా. నాగ్ ఇప్పుడు తన 100వ సినిమాను చేస్తున్నాడు. దీని, తర్వాత నా సామిరంగ దర్శకుడు విజయ్ బిన్నికి మరో ఛాన్స్ ఇచ్చాడు. అలాగే, కొత్త కథలతో వచ్చి మెప్పిస్తే సినిమా తీస్తానని తాజాగా నాగార్జున స్టేట్‌మెంట్ ఇచ్చాడు. ఈ ప్రాజెక్ట్స్ తన అన్నపూర్ణ నుంచే నిర్మించనున్నాడు. ఇలా, మన సీనియర్ హీరోలు తమ ఇమేజ్ డ్యామేజ్ కాకుండా జాగ్రత్తపడుతూ హిట్ ఇచ్చిన దర్శకులతో సేఫ్ గేమ్ అడుతున్నారు.

#chiranjeevi#nagarjuna#balakrishna#venkatesh
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి