Spirituality

Spirituality: గుడిలో సాష్టాంగ నమస్కారం ఎలా చేయాలి?..

రచన: Venu•••4 నిమిషాల పఠనం

మనం సమాజంలో ఎంతోమంది ప్రముఖులనో, పెద్దలనో కలిసినప్పుడు గౌరవసూచకంగా కాస్త ముందుకు వంగి నమస్కరిస్తాం. మరి సృష్టి సమస్తానికీ అధిపతి అయిన ఆ పరమేశ్వరుడి ముందర ఎంత వంగినా తక్కువే అనిపిస్తుంది.

భగవంతుని అనుగ్రహం కోసం, పూర్ణ శరణాగతిని ప్రకటిస్తూ చేసే అత్యున్నతమైన పవిత్ర ప్రక్రియే సాష్టాంగ నమస్కారం. "అష్ట అంగాలు" అంటే శరీరంలోని రెండు పాదాలు, రెండు మోకాళ్లు, రెండు చేతులు, వక్షస్థలం, నుదురు.. మొదలగు ఈ ఎనిమిది ముఖ్య భాగాలు పూర్తిగా నేలకు తగిలేలా బోర్లా పడుకుని చేసే అత్యంత పవిత్రమైన నమస్కార విధానమిది. కేవలం శరీరం మాత్రమే కాకుండా, కళ్లతో స్వామివారిని ధ్యానిస్తూ, మనస్సుతో భగవంతుని రూపాన్ని నిలుపుకుంటూ, వాక్కుతో ఆ పరంధాముని నామాన్ని స్మరిస్తూ ఈ నమస్కారాన్ని ఆచరించాలని పండితులు చెబుతున్నారు..

మనం సమాజంలో ఎంతోమంది ప్రముఖులనో, పెద్దలనో కలిసినప్పుడు గౌరవసూచకంగా కాస్త ముందుకు వంగి నమస్కరిస్తాం. మరి సృష్టి సమస్తానికీ అధిపతి అయిన ఆ పరమేశ్వరుడి ముందర ఎంత వంగినా తక్కువే అనిపిస్తుంది. అందుకే, స్వామీ! నాలోని అహంకారాన్ని, సకల వికారాలను నీ పాదాల చెంత వదిలేస్తున్నాను. ఇక నన్ను నేను ఇంతకన్నా వంచలేను అనే నిరహంకార స్థితికి సంకేతంగా శరీరాన్ని దండంలా నేలపై పడవేసి సమర్పించడమే ఈ సాష్టాంగ నమస్కారంలోని అంతరార్థం.

అయితే ధర్మశాస్త్రాల ప్రకారం సాష్టాంగ నమస్కారం అనేది కేవలం పురుషులకు మాత్రమే పరిమితం, స్త్రీలకు వర్తించదు. స్త్రీ శరీరం సృష్టికారకం. నవమాసాలు జీవాన్ని మోసే గర్భకోశం మరియు అమృతాన్ని అందించే వక్షస్థలం మానవ జననానికీ, జీవనానికీ మూలాధారాలు. అటువంటి అత్యంత పవిత్రమైన భాగాలను నేరుగా నేలకు అనిచి ఒత్తిడి కలిగించకూడదని మన శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకే స్త్రీలు బోర్లా పడుకోకుండా, మోకాళ్లపై నిలబడి ముందుకు వంగి నుదురు, రెండు చేతులు, రెండు మోకాళ్లు మాత్రమే నేలకు తాకేలా పంచాంగ నమస్కారం చేయాలని శాస్త్రాలు పేర్కొంటున్నాయి..

ఇక శరీరంలోని చక్రాలను ఉద్దీపన చేస్తూ, శారీరక రోగనిరోధక శక్తిని పెంచి, మానసిక ప్రశాంతతను అందించే అద్భుత ఆధ్యాత్మిక ప్రక్రియ సాష్టాంగ నమస్కారం అని చెబుతారు.. ఆ సృష్టికర్త ముందు మన ఉనికి ఏపాటిదో గుర్తుచేసుకుంటూ, సమస్తాన్ని ఆ భగవంతునికి అర్పించే పవిత్ర భావనతో చేసే ఈ నమస్కారం మనలోని అహంకారాన్ని తుడిచిపెట్టి సకల శుభాలను, పరిపూర్ణ దైవానుగ్రహాన్ని అందిస్తుంది.

గమనిక: ఇక్కడ అందించిన వివరాలు కేవలం సాంప్రదాయ పురాణ విశ్వాసాలు మరియు ఆధ్యాత్మిక భావనల ఆధారంగా ఇవ్వబడ్డాయి. వీటిని కేవలం మతపరమైన విశ్వాసాల కోణంలోనే చూడాలి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత రంగ నిపుణులను సంప్రదించడం మంచిది.

#Spirituality#Indian culture#perform#Sashtanga Namaskaram#temple
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి