తెలంగాణ

హైదరాబాద్-అమరావతి మధ్య కొత్త ప్రాజెక్ట్.. హైస్పీడ్ రైలు, 12లేన్ల ఎక్స్‌ప్రెస్ వే!

రచన: Mamatha puppala••4 నిమిషాల పఠనం

తెలుగు రాష్ట్రాల మధ్య రవాణా వ్యవస్థను సరికొత్త శిఖరాలకు తీసుకెళ్లేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భారీ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టాయి. హైదరాబాద్‌లోని ఫ్యూచర్ సిటీ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని అమరావతి, మచిలీపట్నం (బందరు) పోర్టుల మధ్య అనుసంధానాన్ని బలోపేతం చేస్తూ ఒకే కారిడార్‌లో హైస్పీడ్ రైల్వే లైన్, 12లేన్ల గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వేలను పక్కపక్కనే నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు.

తెలుగు రాష్ట్రాల మధ్య రవాణా వ్యవస్థను సరికొత్త శిఖరాలకు తీసుకెళ్లేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భారీ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టాయి. హైదరాబాద్‌లోని ఫ్యూచర్ సిటీ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని అమరావతి, మచిలీపట్నం (బందరు) పోర్టుల మధ్య అనుసంధానాన్ని బలోపేతం చేస్తూ ఒకే కారిడార్‌లో హైస్పీడ్ రైల్వే లైన్, 12లేన్ల గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వేలను పక్కపక్కనే నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ప్రస్తుత హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారికి ఒకవైపు ఎక్స్‌ప్రెస్‌వే, మరోవైపు రైలు మార్గం ఉండేలా ప్రాథమిక అలైన్‌మెంట్ ఖరారైంది.

మొత్తం 760 కిలోమీటర్ల పొడవుతో ప్రతిపాదించిన హైదరాబాద్-అమరావతి-చెన్నై హైస్పీడ్ రైలు కారిడార్ నిర్మాణ వ్యయం సుమారు రూ.2.24 లక్షల కోట్లుగా అంచనా వేశారు. ఈ మార్గం తెలంగాణలో 180కిలోమీటర్ల మేర విస్తరించి ఉంటుంది. శంషాబాద్, భారత్ ఫ్యూచర్ సిటీ, డ్రై పోర్టు, నాగార్జునసాగర్ (హాలియా), వాడపల్లి ప్రాంతాల్లో కీలక స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్టుకు దాదాపు 790 హెక్టార్ల భూమి అవసరమవుతుందని భావిస్తుండగా, ఇప్పటికే ప్రాథమిక మార్కింగ్ పనులు పూర్తయ్యాయి.

మరోవైపు, 12వరుసలతో నిర్మించనున్న 297.82 కిలోమీటర్ల ఫ్యూచర్ సిటీ-బందరు పోర్టు గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే ప్రాజెక్ట్ డీపీఆర్ పనులు ప్రస్తుతం వేగంగా జరుగుతున్నాయి. ముచ్చర్ల ఫ్యూచర్ సిటీ సమీపంలోని తిప్పారెడ్డిపల్లి వద్ద ప్రారంభమయ్యే ఈ రహదారి అమరావతి మీదుగా బందరు పోర్టును చేరుకుంటుంది. ఈ మార్గం తెలంగాణలో 118 కిలోమీటర్ల పరిధిలోని 40 గ్రామాలు, ఆంధ్రప్రదేశ్ పరిధిలోని 60 గ్రామాల గుండా సాగనుంది.

రోడ్డు, రైలు మార్గాలు రెండూ ఒకే మార్గంలో సమాంతరంగా పయనించేలా ప్లాన్ చేయడంతో భూసేకరణ ప్రక్రియను ఒకేసారి పూర్తి చేయాలని అధికారులు నిర్ణయించారు. ఒకే కారిడార్‌గా భూసేకరణ చేపట్టడం వల్ల ప్రభుత్వంపై ఆర్థిక, పరిపాలనా భారాలు తగ్గుతాయి. అంతేకాకుండా ఈ రెండు ప్రాజెక్టుల పూర్తయితే హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ నుండి అమరావతి, బందరు పోర్టులకు ప్రయాణ సమయంతో పాటు సరుకు రవాణా వేగం పెరిగి పారిశ్రామికాభివృద్ధి మరింత వేగవంతం కానుంది.

 

#Hyderabad#Amaravati#High Speed Rail#Greenfield Expressway#Bandaru Port#Future City#Telangana#Andhra Pradesh#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి