ఏపీ

Tirumala: భక్తులకు అలర్ట్.. శ్రీవారి ఆర్జిత సేవల ఆన్‌లైన్ కోటా షెడ్యూల్ విడుదల!

రచన: Mamatha puppala••5 నిమిషాల పఠనం

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) 2026 నవంబర్ నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు, దర్శన టోకెన్లు మరియు వసతి గదుల ఆన్‌లైన్ విడుదల షెడ్యూల్‌ను అధికారికంగా ప్రకటించింది. శ్రీవారిని దర్శించుకోవాలనుకునే భక్తులు ఈ తేదీలను గమనించి, టీటీడీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ముందస్తుగా బుకింగ్స్ పూర్తి చేసుకోవాలని అధికారులు సూచించారు.

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) 2026 నవంబర్ నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు, దర్శన టోకెన్లు మరియు వసతి గదుల ఆన్‌లైన్ విడుదల షెడ్యూల్‌ను అధికారికంగా ప్రకటించింది. శ్రీవారిని దర్శించుకోవాలనుకునే భక్తులు ఈ తేదీలను గమనించి, టీటీడీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ముందస్తుగా బుకింగ్స్ పూర్తి చేసుకోవాలని అధికారులు సూచించారు.

ఎంతో డిమాండ్ ఉండే సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవల కోసం ఎలక్ట్రానిక్ డిప్ (లక్కీ డిప్) విధానాన్ని అమలు చేస్తున్నారు. ఇందుకోసం భక్తులు ఆగస్టు 18 ఉదయం 10 గంటల నుంచి ఆగస్టు 20 ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. లక్కీ డిప్‌లో టికెట్లు పొందినవారు ఆగస్టు 22 మధ్యాహ్నంలోగా సొమ్ము చెల్లించి టికెట్లను ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది.

ఇతర ఆర్జిత సేవలైన కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్లను ఆగస్టు 21న ఉదయం 10 గంటలకు, అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవల కోటాను విడుదల చేయనున్నారు. అనంతరం ఆగస్టు 24న ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణం టోకెన్లు, 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం, మధ్యాహ్నం 3 గంటలకు వృద్ధులు, దివ్యాంగుల ప్రత్యేక దర్శన టోకెన్లను అందుబాటులో ఉంచుతారు.

అత్యంత ప్రజాదరణ పొందిన రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఆగస్టు 25న ఉదయం 10 గంటలకు, తిరుమల మరియు తిరుపతిలోని వసతి గదుల బుకింగ్ కోటాను అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. భక్తులు దళారులను నమ్మి మోసపోకుండా కేవలం టీటీడీ అధికారిక పోర్టల్ ద్వారానే టికెట్లను రిజర్వ్ చేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.

వరుస సెలవులు.. కొండపై భారీ రద్దీ

వారాంతం కావడంతో తిరుమల కొండపై భక్తుల రద్దీ తీవ్రంగా ఉంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లన్నీ శ్రీవారి సర్వదర్శనం కోసం వేచి చూస్తున్న భక్తులతో నిండిపోయాయి. టోకెన్లు లేని సాధారణ భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి దాదాపు 18 నుంచి 24 గంటల వరకు సమయం పడుతోంది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని క్యూ లైన్లలో ఉన్న వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్నప్రసాదం, తాగునీరు, పాలు అందిస్తూ టీటీడీ అధికారులు నిరంతరం ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

శనివారం (ఆగస్టు 15న) ఒక్కరోజే 90,293 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. వీరిలో 53,090 మంది తలనీలాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు. హుండీ ఆదాయం రూ.3.81 కోట్లు వచ్చినట్లు పేర్కొన్నారు. రానున్న రోజుల్లో రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. వృద్ధులు, చిన్నపిల్లలతో వచ్చే భక్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని టీటీడీ అధికారులు ఎప్పటికప్పుడు తగు సూచనలు చేస్తున్నారు.

#Tirumala#TTD#Srivari Seva Tickets#November Quota#Special Entry Darshan#Electronic Dip#Accommodation Booking#Tirupati Rush
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి