సినిమా

Mrunal Thakur: రణవీర్ సింగ్ వల్లే హీరోయిన్ అయ్యా

రచన: Anshu••4 నిమిషాల పఠనం

Mrunal Thakur: బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నానని చెప్పింది గ్లామర్ బ్యూటీ మృణాల్ ఠాకూర్. ఇటీవల ఓ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో ఈ ఆసక్తికరమైన విషయాన్ని బయట పెట్టింది. రణవీర్ సింగ్ తో కలిసి మృణాల్ ఒక కమర్షియల్ యాడ్ ఫిల్మ్ చేసింది. అది, బాగా పాపులర్ అయింది. ఆ తర్వాత చాలామంది మేకర్స్ మృణాల్ గురించి ఆరా తీశారు. ఇందులో, భాగంగానే రణవీర్ సింగ్ ని కూడా అడిగారు. ఆయన పాజిటివ్‌గా చెప్పడంతో హీరోయిన్‌గా మారింది మృణాల్.

మృణాల్ ఠాకూర్ తెలుగులో మంచి క్రేజీ హీరోయిన్. ఆమె నటించిన సీతారామం బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత నాని సరసన హాయ్ నాన్న చిత్రంలో నటించి మరో హిట్ అందుకుంది. ఇలా, రెండు బ్లాక్ బస్టర్స్ అందుకున్న ఈ బాలీవుడ్ బ్యూటీ.. విజయ్ దేవరకొండ సరసన ఫ్యామిలీ స్టార్ చిత్రంలో నటించింది. కానీ, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేదు.

దీని, తర్వాత చేసిన అడవి శేష్ డెకాయిట్ కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ, బాక్సాఫీస్ వద్ద మాత్రం కమర్షియల్‌గా హిట్ సాధించలేదు. ప్రస్తుతం, మృణాల్‌కి తెలుగులో అవకాశాలు లేవు. హిందీలో మాత్రం బిజీగానే ఉంది. ఇక, రణవీర్ సింగ్ నటించిన ధురంధర్ సినిమా గురించి, అందులో ఆయన పాత్ర గురించి మాట్లాడింది. పాత్రలో జీవించాడు తప్ప రణవీర్ సింగ్ కనిపించలేదని చెప్పుకొచ్చింది.

ఇక, ఆమె రణవీర్ సింగ్ తో చేసిన కమర్షియల్ యాడ్ ఫిల్మ్ తో సినిమాలో హీరోయిన్ ఛాన్సులొచ్చాయని, ఇందుకు రణవీర్ సింగ్ కి ఎప్పటికీ రుణపడి ఉంటానని చెప్పింది. కాగా, ఈ మధ్య తమిళ హీరో ధనుష్ తో మృణాల్ లవ్ లో ఉందని వార్తలు ప్రచారం అయ్యాయి. అలాగే, తన డీప్ ఫేక్ ఫొటోస్, వీడియోస్ కూడా బాగ వైరల్ అవడంతో సోషల్ మీడియా వేదికగా వార్నింగ్ ఇచ్చింది. అంతేకాదు, కోర్టును కూడా ఆశ్రయించింది మృణాల్.

#Mrunal Thakur#Ranveersingh#Dhurandhar#Bollywood#Tollywood
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి