Vishwambhara: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సినిమాలలో అత్యంత క్రేజీ ప్రాజెక్ట్ విశ్వంభర. మల్లిడి వశిష్ట దర్శకత్వం వహిస్తున్నాడు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ-ప్రమోద్ నిర్మిస్తున్నారు. త్రిష కృష్ణన్ హీరోయిన్‌గా, ఆషిక రంగనాథ్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. అయితే, ఇంకా ఈ సినిమా విషయంలో మెగాస్టార్‌కి స్పష్టత కరువైందని తాజా పరిణామాలు చూస్తే అర్థమవుతోంది. అందుకే, ఆయన మౌనంగా ఉన్నట్టు తెలుస్తోంది.
సాధారణంగా, చిరంజీవి సినిమా అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ థియేటర్స్‌లో బొమ్మ పడాల్సిందే. చిరు సినిమాకి బాక్సాఫీస్ వద్ద ఉండే సందడే వేరు. ప్రపంచవ్యాప్తంగా ఆయనకున్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒకదశలో, వరుసగా 18 హిట్స్ ఇచ్చిన చిరు..మరొక దశలో వరసుగా ఫ్లాపులను ఇచ్చారు. అలాంటి, సమయంలో హిట్లర్ మంచి కమర్షియల్ సక్సెస్ సాధించి ఫాంలోకి వచ్చాడు.
ఆ తర్వాత నుంచి చిరు సినిమాలు వస్తూనే ఉన్నాయి. రాజకీయాల వల్ల కొన్నేళ్ళు గ్యాప్ తీసుకున్నా, 150 తో రీ ఎంట్రీ తర్వాత అసలు గ్యాప్ ఇవ్వడం లేదు. అయితే, ఆయన ఎంతో నచ్చి, ఇష్టపడి చేస్తున్న సోషియో ఫాంటసీ చిత్రం విశ్వంభర మాత్రం ఎప్పుడు రిలీజ్ అవుతుందో క్లారిటీ రావడం లేదు. ఇప్పటికే, పలుమార్లు ఈ సినిమా రిలీజ్ అనుకున్న తర్వాత వాయిదా పడింది. ఈ ఏడాది దసరా పండుగకి వస్తుందనుకున్నారు.
తాజాగా, మెగాస్టార్ గెస్ట్‌గా హాజరైన కొరియన్ కనకరాజు మూవీ సెక్సెస్ సెలబ్రేషన్‌లో మెగా 158 టైటిల్ 'కదిరి' అని లీక్ చేశాడు, టీజర్ ఉందని హింట్ ఇచ్చాడు. కానీ, విశ్వంభర మూవీపై ఎలాంటి, కన్‌ఫర్మేషన్ ఇవ్వలేదు. దీంతో, ఈ సినిమా అవుట్‌పుట్ ఇంకా మెగాస్టార్‌ని సంతృప్తి పరిచినట్టుగా లేదని, అందుకే..దీని విషయంలో ఆయన మౌనంగా ఉంటున్నాడని చెప్పుకుంటున్నారు. మరి, మెగాస్టార్ బర్త్ డే ఆగస్టు 22న అయినా విశ్వంభర అప్‌డేట్ ఉంటుందేమో చూడాలి.












