Shraddha Kapoor: సీజన్స్ ని టార్గెట్ చేస్తూ మన స్టార్ హీరోలు తమ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. ప్రతీ ఏటా సంక్రాంతి, సమ్మర్, దసరా, దీపావళి, క్రిస్మస్ పండుగలకి చిన్న నుంచి పెద్ద సినిమాల వరకూ అన్నీ పోటీ పడుతుంటాయి. కంటెంట్ మీద నమ్మకం ఉంటే చిన్న సినిమా కూడా పెద్ద స్టార్ హీరో సినిమాతో పోడీ పడి నెగ్గుతుంది.
అలాంటి, సినిమాలు ఈసారి దసరా, క్రిస్మస్ పండుగలకి బరిలో దిగబోతున్నాయి. ఈ ఏడాది చిన్న సినిమాగా వచ్చి పెద్ద హిట్ కొట్టినవి చాలానే ఉన్నాయి. అంతేకాదు, ఇటీవల కాలంలో సక్సెస్‌లు లేక ఇబ్బంది పడ్డ అఖిల్, వరుణ్ తేజ్, సమంత లాంటి వారు సాలీడ్ హిట్ కొట్టి ఫాంలోకి వచ్చారు. ఇక, మిగిలింది పాన్ ఇండియా సినిమాలే.
కన్నడ రాకింగ్ స్టార్ యష్ నటిస్తున్న ఫ్యాక్షన్, మాఫియా డ్రామా టాక్సిక్. తండ్రీకొడుకుల మధ్య సాగే యుద్ధం నేపథ్యంలో గీతూ మోహన్‌దాస్ ఈ సినిమాను రూపొందించారు. కియారా అద్వానీ, నయనతార, తారా సుతారియా, రుక్మిణి వసంత్, హూమ ఖురేషి కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాను ఆగస్టు 26వ తేదీన రిలీజ్ చేస్తున్నారు.
శ్రద్ధ కపూర్ హిందీలో నటించిన సినిమా ‘ఈఠ’. వాస్తవానికి, ఈ సినిమా కూడా ఆగస్టు 26న రిలీజ్ చేయాలనుకున్నారు మేకర్స్. కానీ, యష్ లాంటి పాన్ ఇండియా హీరో నటించిన టాక్సిక్ మూవీతో పోటీ ఎందుకు అనుకొని, ప్రభాస్ నటిస్తున్న ఫౌజీ సినిమాతో పోటీకి వస్తున్నారు. ఆగస్టు 26న అనుకున్న ‘ఈఠ’ చిత్రం ఫౌజీ రిలీజ్ రోజునే పోటీకి వస్తున్నారు. అంటే డిసెంబర్ 4న ఫౌజీ తో పాటు శ్రద్ధ నటించిన ‘ఈఠ’ కూడా రిలీజ్ కాబోతోంది.
దీంతో, యష్ లాంటి హీరోను తట్టుకోలేని మీరు మా ప్రభాస్ అన్నని ఎలా తట్టుకుంటారు అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కాగా, హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫౌజీ ఎట్టి పరిస్థితుల్లో డిసెంబర్ 4న రిలీజ్ చేస్తామని మేకర్స్ డబుల్ కన్‌ఫర్మేషన్ ఇచ్చారు. ఇక, బాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉన్న శ్రద్ధ కపూర్ ‘ఈఠ’ మూవీతో బరిలోకి దిగబోతోంది. కాగా, గతంలో ప్రభాస్ కి జంటగా శ్రద్ధ కపూర్ సాహో మూవీలో నటించింది.












