Varun Tej: గ్యాప్ వచ్చినా కూడా మన టాలీవుడ్ హీరోలు సాలీడ్ హిట్‌తో మంచి కంబ్యాక్ ఇస్తున్నారు. మొన్నామధ్య అక్కినేని అఖిల్ లెనిన్ సినిమాతో వచ్చి బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ ని అందుకున్నాడు. హీరోయిన్ సమంత కూడా మా ఇంటి బంగారం సినిమాతో వచ్చి బాక్సాఫీస్ వద్ద 100 కోట్లను కొల్లగొట్టింది. ఈ క్రమంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ వచ్చి హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు.
మేర్లపాక గాంధీ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన సినిమా కొరియన్ కనరాజు. రితిక నాయక్ హీరోయిన్‌గా, సత్య కీలక పాత్రలో నటించారు. ఆగస్టు 7వ తేదీన వచ్చిన ఈ సినిమా మూడు రోజుల్లోనే లాభాల బాట పట్టింది. విడుదలైన అన్నీ చోట్లా బ్రేకీవెన్ అయింది. ఈ సందర్భంగా నిర్వహించిన సక్సెస్ సెలబ్రేషన్స్‌లో సీక్వెల్‌ని కన్‌ఫర్మ్ చేశారు.
కొరియన్ కనకరాజు భారీ విజయం అందుకున్న నేపథ్యంలో చిత్రబృందం విజయోత్సవ వేడుకను నిర్వహించారు. దీనికి, మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తక్కువ బడ్జెట్‌తో మంచి విజయాలను అందుకుంటున్న చిత్రబృందాలను అభినందించారు. కొరియన్ కనకరాజు సినిమా గురించి, ఇందులో నటించిన వారి గురించి, టెక్నీషియన్ గురించి మాట్లాడి ప్రశంసించారు.
అంతేకాదు, ఈ సినిమా క్లైమాక్స్ చూసిన తర్వాత సీక్వెల్ ఉందనిపించింది అంటూ చెప్పకనే సీక్వెల్ విషయాన్ని కన్‌ఫర్మ్ చేశాడు చిరు. ఇదే కాదు, కొరియన్ కనకరాజుకి సీక్వెల్ కెన్యెన్ కనకరాజు అయితే బావుంటుందని నాకనిపించింది.. అంటూ సీక్వెల్ టైటిల్ కూడా చిరు పెట్టేశారు. వరుణ్ దీనికి, స్పందిస్తూ..మీరిచ్చారుగా అదే టైటిల్ వాడేస్తాము అన్నాడు. దీనితో, ఖచ్చితంగా కొరియన్ కనకరాజుకి పార్ట్ 2 ఉందని సీక్వెల్‌పై స్పష్టత వచ్చింది.












