RC 17-Sukumar: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ తర్వాత మళ్ళీ ఇప్పటి వరకూ హిట్ చూడలేకపోయాడు. సాధారణంగానే, ఇండస్ట్రీలో ఒక టాక్ ఉంది. అదేమిటంటే, రాజమౌళి దర్శకత్వంలో హీరోగా నటించిన వాళ్ళకి నెక్స్ట్ సినిమా గ్యారెంటీగా ఫ్లాప్ అవుతుందని. ఈ విషయంలో ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. పాత విషయాలకంటే, ఆర్ఆర్ఆర్ మూవీనే తీసుకుందాం.
ఈ సినిమాలో ఎన్‌టిర్, చరణ్ హీరోలుగా నటించారు. కొమరం భీమ్ పాత్రలో తారక్, అల్లూరి సీతారామరాజు పాత్రలో చరణ్ అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నారు. ఈ మూవీతో, మనకి ఆస్కార్ కూడా దక్కింది. అయితే, ఆర్ఆర్ఆర్ తర్వాత, మళ్ళీ అటు తారక్‌కి గానీ, ఇటు చరణ్‌కి గానీ హిట్ దక్కలేదు. ఎన్‌టిర్ దేవర మూవీలో నటించాడు. దీని, ఫలితం తెలిసిందే. ఇక, చరణ్ నుంచి గేమ్ ఛేంజర్, పెద్ది చిత్రాలొచ్చాయి. వీటి రిజల్ట్ కూడా అందరికీ తెలిసిందే.
ప్రస్తుతం, రామ్ చరణ్ తన 17వ సినిమా కోసం రెడీ అవుతున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుంది. అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. సుకుమార్, ఇప్పుడు ప్రీ ప్రొడక్షన్స్ వర్క్‌లో బిజీగా ఉన్నాడు. దాదాపు, ఈ వర్క్ పూర్తి కావచ్చింది. త్వరలో, ఘనంగా ఓపెనింగ్ నిర్వహించి రెగ్యులర్ షూటింగ్‌కి ప్లాన్ చేయనున్నారు. ఈ సినిమా కోసం చరణ్ సరికొత్త మేకోవర్‌లో కనిపించబోతున్నాడట.
పెద్ది సినిమాలో రెండు రకాల పాత్రల్లో నటించి ఆకట్టుకున్నాడు. ఈ పాత్రలకి భిన్నంగా సుకుమార్ రూపొందించబోతున్న ఆర్సీ 17 కోసం సన్నద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. పొడవాటి జుట్టు, స్లిమ్ పర్సనాలిటీతో చరణ్ రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక, గతంలో సుకుమార్-రామ్ చరణ్ కలిసి రంగస్థలం లాంటి బ్లాక్ బస్టర్ చేసిన సంగతి తెలిసిందే.












