నేటి కాలంలో గవర్నమెంట్ జాబ్ వస్తే లైఫ్ సెట్ అయినట్టే అని భావిస్తున్నవారు ఎందరో ఉన్నారు.. ఇందుకోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు.. అయితే ప్రస్తుతం ఉద్యోగాన్ని పొందడం అంత సులభం కాదు. ఎంత కష్టపడినా కొన్నిసార్లు విజయం రాదు. ఇలాంటి విషయంలో జ్యోతిష్య శాస్త్రం కొన్ని పరిహారాలను సూచిస్తుంది..
ఇక అన్ని అర్హతలు ఉండి గ్రహాల ప్రభావం వల్ల ఉద్యోగం సాధించలేని వారు ఏ దేవుళ్లను ఆరాధించాలో తెలుసుకొందాం..ప్రతి సోమవారం శివలింగాని అభిషేకం చేయడం.. ప్రతి నెల రెండవ మంగళవారం నాడు హనుమంతుని ఆలయాన్ని దర్శించుకొని ఆయనను పూజించడం.. అలాగే ప్రతి రోజు హనుమాన్ చాలీసా చదవడం మంచి ఫలితాలను ప్రసాదిస్తుందని పండితులు చెబుతున్నారు.
అలాగే విఘ్నాలకు అధిపతి అయిన వినాయకుడిని నిత్యం పూజించాలని.. ముఖ్యంగా కుడివైపు తొండం ఉన్న గణేశుడు పూజ చేయడం వల్ల కుడా అనుకున్న పనులు అడ్డంకులు లేకుండా జరుగుతాయని చెబుతున్నారు.. ఇక హిందూ సంప్రదాయంలో గోవులకు ప్రత్యేక స్థానం ఉన్న విషయం తెలిసిందే.. అందుకే గోవు పూజ చాలా విశిష్టమైనదిగా శాస్త్రాలలో పేర్కొంటారు..
ఈ క్రమంలో ఏదైన ఇంటర్వ్యూకి వెళ్లే ముందు ఆవుకి బెల్లం లేదా చపాతీ, గోధుమ పిండిని తినిపించడం శుభదాయకంగా భావిస్తారు. మరోవైపు శనిశ్వరుని ఆరాధన చేస్తూ.. ఓం శనిశ్చరాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండం సరైన ఫలితాలు ఇవ్వడంలో తోడ్పడుతుందని పండితులు చెబుతున్నారు..
జ్యోతిషశాస్త్ర సిద్ధాంతం ప్రకారం జాతకంలో సూర్య గ్రహం కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి, ఈ గ్రహం అనుకూలంగా ఉంటే ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని శాస్త్రం తెలియచేస్తుంది.. అందుకే సూర్యునికి సంబంధించిన పరిహారాలు పండితుల సహాయంతో చేసుకోవాలని అంటున్నారు.
గమనిక: ఇక్కడ అందించిన వివరాలు కేవలం సాంప్రదాయ పురాణ విశ్వాసాలు మరియు ఆధ్యాత్మిక భావనల ఆధారంగా ఇవ్వబడ్డాయి. వీటిని కేవలం మతపరమైన విశ్వాసాల కోణంలోనే చూడాలి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత రంగ నిపుణులను సంప్రదించడం మంచిది.












