Health

Health: విపరీతంగా జుట్టు రాలుతోందా? కారణం ఇదే కావచ్చు! బీ అలర్ట్..

రచన: Venu••4 నిమిషాల పఠనం

రోజుకు కొంత జుట్టు రాలడం సహజమే. సాధారణంగా రోజుకు సుమారు 50 నుంచి 100 వెంట్రుకలు రాలడం సహజమే.. కానీ జుట్టు గుత్తులు గుత్తులుగా రాలడం, తలపై బట్టతల వస్తున్న సూచనలు కనిపించడం లేదా జుట్టు వేగంగా పలుచబడటం మొదలైతే నిర్లక్ష్యం చేయకండని ఆరోగ్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.

జుట్టు రాలడం ఎక్కువైపోయిందా? షాంపూలు, హెయిర్ ఆయిల్స్ మార్చినా ఫలితం కనిపించడం లేదా? అయితే కేవలం బయట నుంచి చేసే హెయిర్ కేర్‌పైనే దృష్టి పెట్టడం సరిపోదు. శరీరంలో కొన్ని పోషకాలు లోపించడం కూడా జుట్టు రాలడానికి కారణం కావచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ముఖ్యంగా జింక్ లోపం ఉన్నప్పుడు కొంతమందిలో జుట్టు రాలడం కనిపించవచ్చు. జింక్ మన శరీరంలో కణాల పెరుగుదల, మరమ్మతు వంటి అనేక ప్రక్రియలకు అవసరమైన ముఖ్యమైన ఖనిజం. అయితే జుట్టు రాలడానికి జింక్ లోపమే ఏకైక కారణం అని చెప్పడం మాత్రం సరికాదు.

జింక్ లోపంతో పాటు ఐరన్ లేదా ప్రోటీన్ లోపం, థైరాయిడ్ సమస్యలు, జన్యుపరమైన కారణాలు, హార్మోన్ల మార్పులు, తీవ్రమైన అనారోగ్యం, ఒత్తిడి, కొన్ని మందులు, అలాగే జుట్టును బిగుతుగా కట్టుకోవడం వంటి కారణాల వల్ల కూడా హెయిర్ లాస్ రావచ్చని న్యూట్రిషన్స్ పేర్కొంటున్నారు..

అయితే జింక్ లోపం ఉందేమో అనుమానం ఉంటే ఆహారంలో సహజమైన జింక్ వనరులను చేర్చుకోవచ్చు. గుమ్మడి గింజలు, నువ్వులు, శనగలు, పప్పు ధాన్యాలు, గింజలు, పాలు, పెరుగు, గుడ్లు, చేపలు, మాంసాహారం వంటి జింక్ పదార్థాలు ఉన్న ఆహారం తీసుకోవాలని సూచిస్తున్నారు.

అయితే జుట్టు రాలుతోందనే బాధలో జింక్ లేదా ఇతర హెయిర్ సప్లిమెంట్లు సొంతంగా తీసుకోవడం మంచిది కాదు. అవసరం లేకుండా ఎక్కువ మోతాదులో కొన్ని విటమిన్లు, మినరల్స్ తీసుకోవడం కూడా సమస్యలకు దారితీయవచ్చని, అందుకే జింక్, ఐరన్ లేదా బయోటిన్ సప్లిమెంట్లు అవసరమా లేదా అనేది వైద్యుల సలహాతో రక్త పరీక్షల ద్వారా నిర్థారించుకుని తీసుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు..

మరోవైపు రోజుకు కొంత జుట్టు రాలడం సహజమే. సాధారణంగా రోజుకు సుమారు 50 నుంచి 100 వెంట్రుకలు రాలడం సహజమే.. కానీ జుట్టు గుత్తులు గుత్తులుగా రాలడం, తలపై బట్టతల వస్తున్న సూచనలు కనిపించడం లేదా జుట్టు వేగంగా పలుచబడటం మొదలైతే నిర్లక్ష్యం చేయకండని ఆరోగ్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.

కాబట్టి హెయిర్ ఫాల్‌కు అసలు కారణం ఏంటో గుర్తించడం చాలా ముఖ్యం. అవసరమైతే డెర్మటాలజిస్ట్‌ను సంప్రదించి కారణాన్ని నిర్ధారించుకోవాలి. సరైన పోషకాహారం, సమతుల్య ఆహారం, అవసరమైన చికిత్స ఇవే ఆరోగ్యకరమైన జుట్టుకు అసలైన మార్గం అని తెలియచేస్తున్నారు.

ముఖ్య గమనిక: ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఇది నిపుణుల లేదా వైద్యుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించిన ఎలాంటి నిర్ణయాలైనా తీసుకునే ముందు ఖచ్చితంగా మీ డాక్టర్‌ను సంప్రదించాల్సిందిగా మనవి!..

#Health#hair falling#Iron#protein deficiency#Nutrition
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి