సినిమా

Mega 158: పుసుక్కున టైటిల్ లీక్ చేసిన మెగాస్టార్!

రచన: Anshu••4 నిమిషాల పఠనం

Mega 158: ఈ ఏడాది ప్రారంభంలో మెగాస్టార్ చిరంజీవి మన శంకరవరప్రసాద్‌గారు సినిమాతో వచ్చి బాక్సాఫీస్ వద్ద 300 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ని రాబట్టిన సంగతి తెలిసిందే. సరైన మాస్ ఎంటర్‌టైనర్ పడితే మెగా మేనియా ఏ రేంజ్‌లో ఉంటుందో చెప్పడానికి, మన శంకరవరప్రాద్‌గారు ఒక ఉదాహరణ. అంతకుముందు వాల్తేరు వీరయ్య సినిమా కూడా అంతే. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది.

ఇక, మెగాస్టార్.. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ఓ భారీ యాక్షన్ సినిమాను చేస్తున్నాడు. ప్రియమణి హీరోయిన్‌గా అనస్వర రాజన్, నివేదా పేతురాజ్, మురళీ శర్మ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈ సినిమాకి మ్యూజిక్ సెన్షేషన్ ఎస్.ఎస్.థమన్ సంగీతమందిస్తున్నాడు. అయితే, తాజాగా చిరంజీవి మెగా 158 టైటిల్‌ని లీక్ చేశాడు. 'కదిరి' అని మేకర్స్ టైటిల్ ని ఫిక్స్ చేశారు.

ఆగస్టు 22న మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్‌తో పాటు టీజర్ కూడా రాబోతుంది. ఈ విషయాన్ని కూడా స్వయంగా చిరంజీవి రివీల్ చేయడం ఆసక్తికరం. మొత్తానికి, చిరంజీవి నటిస్తున్న మెగా 158 నుంచి టైటిల్ అండ్ టీజర్ రెడీగా ఉన్నాయి. ఇంతకముందు కూడా చిరు ఏదైనా ఈవెంట్‌కి వస్తే, తన సినిమాలకి సంబందించిన టైటిల్ లేదా సన్నివేశాల గురించి లీకులిస్తుంటాడు. అలాగే, ఇప్పుడు కూడా.

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన కొరియన్ కనకరాజు సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్‌కి గెస్ట్‌గా వచ్చిన చిరు, యాంకర్ అడిగినదానికి, మెగా 158 టైటిల్ 'కదిరి' అని సడన్‌గా అనేశాడు. దీంతో, ఈ సినిమా టైటిల్ 'కదిరి నరసింహుడు' అని మెగా ఫ్యాన్స్ ఫిక్సైయ్యారు. అలాగే, టీజర్ రెడీ చేశావు కదా థమన్..ఆర్ఆర్ ఎలా వచ్చింది..అంటూ టీజర్ అప్‌డేట్ కూడా ఇచ్చేశాడు. దీంతో, మెగా 158 నుంచి వచ్చే అప్‌డేట్స్ రివీలైపోయాయి.

#mega158#kadiri#chiranjeevi#bobbykolli
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి