తెలంగాణ

HyD : శంషాబాద్ ఎయిర్ పోర్టులో హై అలర్ట్.. 31 వరకు హై సెక్యూరిటీ!

రచన: Kumar••3 నిమిషాల పఠనం

ఆగస్టు 15 స్వాతంత్ర్యదినోత్సవం సమీపిస్తుండటంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి.ఇండిపెండెన్స్ రోజున ఉగ్రదాడులు జరిగే ఆస్కారముందని నిఘా వర్గాల హెచ్చరికల మేరకు కేంద్రం ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి.

ఆగస్టు 15 స్వాతంత్ర్యదినోత్సవం సమీపిస్తుండటంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి.ఇండిపెండెన్స్ రోజున ఉగ్రదాడులు జరిగే ఆస్కారముందని నిఘా వర్గాల హెచ్చరికల మేరకు కేంద్రం ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి.దీంతో దేశవ్యాప్తంగా విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, రద్దీప్రాంతాల్లో హైఅలర్ట్ ప్రకటించాయి. అక్కడ అధికంగా భద్రతా బలగాలను మోహరించాలని ఆదేశాలు జారీ అయ్యాయి.

ఈ క్రమంలోనే హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్ పోర్టులో సీఐఎస్‌ఎఫ్ బలగాలు, స్థానిక పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నేపథ్యంలో ఎయిర్‌పోర్ట్ ప్రాంగణంలో 'హై అలర్ట్' ప్రకటించారు.ఈ నెల 31 వరకు భద్రతా బలగాలు ప్రత్యేక సెక్యూరిటీని కల్పించనున్నాయి. ఎయిర్ పోర్టులోని టెర్మినల్ భవనాలు, పార్కింగ్ ప్రాంతాలు, ఇతర సున్నితమైన ప్రదేశాల్లో బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలతో నిరంతరం తనిఖీలు చేపట్టనున్నాయి.

అలాగే, పరిసరాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్తగా ఎయిర్ పోర్టుకు వచ్చే సందర్శకులు (విజిటర్స్) పాసులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. విమానాశ్రయానికి వచ్చే ప్రతి వాహనం, ప్రయాణికుల లగేజీని భద్రతా దళాలు క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే లోనికి అనుమతించనున్నారు. రూల్స్ కఠినతరం చేసినందున ప్రయాణికులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా నిర్దేశిత సమయం కంటే కాస్త ముందుగానే రావాలని, భద్రతా సిబ్బంది విధులకు సహకరించాలని ఎయిర్‌పోర్ట్ అధికారులు ప్యాసింజర్స్‌కు విజ్ఞప్తి చేశారు.

#Shamshabad airport#highalert#Tight Security#hyderabad#independanceday
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి