రాజకీయాలు

BRS : మేం చేసింది కూడా కాంగ్రెస్ చేయడం లేదు : హరీశ్ రావు

రచన: Kumar••3 నిమిషాల పఠనం

రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన స్కీమ్స్ కూడా అమలు కావడం లేదని శాసనసభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని, ప్రజలు, ఉద్యోగులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన స్కీమ్స్ కూడా అమలు కావడం లేదని శాసనసభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని, ప్రజలు, ఉద్యోగులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను మర్చిపోయిందని విమర్శించారు.

బీఆర్ఎస్ టైంలో చాలా హామీలు నెరవేర్చామని, ఎన్నో కొత్త పథకాలు అమలు చేశామని.. కనీసం వాటిని కూడా కాంగ్రెస్ సర్కార్ కొనసాగించడం లేదని మండిపడ్డారు. బుధవారం ట్రైబల్ ఎంటర్‌ప్రెన్యూర్స్ బిజినెస్ అవేర్నెస్ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి ఈ సందర్బంగా అధికారపార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రధాన ప్రతిపక్షంగా అసెంబ్లీలో గిరిజనుల హక్కుల కోసం కొట్లాడతామని చెప్పారు.

మహిళా విద్యార్థులు చదువుకోవాలని, దేశంలోనే మొదటిసారి కేసీఆర్ ప్రభుత్వం ఎస్టీ మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీ పెట్టిన విషయాన్ని ఈ సందర్బంగా గుర్తుచేశారు. అంతేకాకుండా 6 లక్షల ఎకరాల పోడు భూములకు పట్టాలు ఇవ్వడంతో పాటు 3 ఫేజ్ కరెంటు ఇచ్చి, రైతు బంధు ఇచ్చి వారిని యాజమానులను చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని తెలిపారు.

https://x.com/TeluguScribe/status/2087416866067317050?s=20

ఉమ్మడి రాష్ట్రంలో 6 శాతం రిజర్వేషన్ ఉంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 శాతం రిజర్వేషన్ గిరిజనుల కోసం కల్పించామన్నారు.3,300 గిరిజన తండాలను గ్రామపంచాయితీలు కూడా చేసామని వెల్లడించారు. కానీ, ఎన్నికల సమయంలో అడ్డగోలుగా కాంగ్రెస్ ఇచ్చిన హమీలను నమ్మి ప్రజలు మోసపోయారని.. ఇప్పుడు బాధపడుతున్నారని పేర్కొన్నారు.

https://x.com/TeluguScribe/status/2087420121954635882?s=20

#BRS#harish rao#tribals meet#telangana#congress party
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి