National

Tamilnadu : సీఎం విజయ్ మరో సంచలనం.. డీమిలిటేషన్‌కు వ్యతిరేకంగా తీర్మాణం

రచన: Kumar•••4 నిమిషాల పఠనం

తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ మరోసారి సంలచన నిర్ణయం తీసుకున్నారు. డీలిమిటేషన్ (నియోజకవర్గాల పునర్విభజన) బిల్లుకు వ్యతిరేకంగా రాష్ట్ర అసెంబ్లీలో తీర్మాణం ప్రవేశపెట్టారు. ఇప్పటికే నీట్, ఎఫ్‌సీఆర్ఏ బిల్లులకు సైతం వ్యతిరేకంగా టీవీకే సర్కార్ అసెంబ్లీలో తీర్మాణం పెట్టడమే కాకుండా ఆమోదించిన విషయం తెలిసిందే.

తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ మరోసారి సంలచన నిర్ణయం తీసుకున్నారు. డీలిమిటేషన్ (నియోజకవర్గాల పునర్విభజన) బిల్లుకు వ్యతిరేకంగా రాష్ట్ర అసెంబ్లీలో తీర్మాణం ప్రవేశపెట్టారు. ఇప్పటికే నీట్, ఎఫ్‌సీఆర్ఏ బిల్లులకు సైతం వ్యతిరేకంగా టీవీకే సర్కార్ అసెంబ్లీలో తీర్మాణం పెట్టడమే కాకుండా ఆమోదించిన విషయం తెలిసిందే. తాజాగా డీలిమిటేషన్ మీద విజయ్ సర్కార్ నిర్ణయం సర్వత్రా చర్చకు దారి తీసింది.

అయితే, డీలిటేషన్ వ్యతిరేకించడానికి గల కారణాలను ఆయన వెల్లడించారు. జనాభా నియంత్రణకు తమిళనాడులోని గత ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవడం వలన అక్కడ బర్త్ రేటు పడిపోయిందని.. ఇప్పుడు కేంద్రం జనాభా ప్రాతిపదినక నియోజకవర్గాల పునర్విభజన చేయడం వలన రాష్ట్రానికి ఎంపీ సీట్లు తగ్గిపోతాయని.. ఫలితంగా కేంద్రంలో రాష్ట్ర ప్రభావం తగ్గుతుందన్నారు. అది రాష్ట్ర ప్రజలకు నష్టం చేకూరుస్తుందని పేర్కొన్నారు. పార్లమెంటులో తమిళప్రజల వాయిస్ వినిపించే హక్కులు తాము కోల్పోతామని తెలిపారు. జనాభా ఆధారంగా నియోజకవర్గా పునర్విభజన జరిగితే కేవలం తమిళనాడు మాత్రమే కాదని, దక్షిణాది రాష్ట్రాలన్నిటికీ నష్టమని చెప్పారు.

అందుకే డీలిమిటేషన్‌ను ఎట్టిపరిస్థితుల్లోనూ తాము అంగీకరించేది లేదని స్పష్టంచేశారు. దీనికి తోడు కేంద్రం ముందు విజయ్ సర్కార్ మూడు డిమాండ్లను తీర్మాణం రూపంలో ఉంచింది. లోక్‌సభ సీట్ల సంఖ్యను ఎప్పటికీ 543 వద్దే ఉంచాలని, రాష్ట్రాలకు ప్రస్తుతమున్న ఎంపీ సీట్ల సంఖ్యను శాశ్వతం చేయాలని కోరారు. రాష్ట్రాల అసెంబ్లీల్లో కూడా మహిళలకు 33 శాతం రిజర్వేషన్ తీసుకురావాలని డిమాండ్ చేశారు.

అయితే, ఈ ఏడాది మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్లో బీజేపీ సంచలన విజయం నమోదు చేయడంతో పార్లమెంటు ఉభయసభల్లో ఎన్డీయే సర్కారుకు మెజార్టీ పెరిగిందని పొలిటికల్ అనలిస్టులు చెబుతున్నారు. ఫలితంగా మరోసారి మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లులను కేంద్రం ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తోందని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే తమిళనాడు సర్కార్ డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా తీర్మాణం చేసినట్టు సమాచారం. కాగా, మైనార్టీలో ఉన్న విజయ్ సర్కార్‌కు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వడం మూలానే విజయ్.. రాహుల్ గాంధీ సూచనతో నీట్, ఎఫ్‌సీఆర్ఏ బిల్లు, డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా తీర్మాణాలు పాస్ చేస్తున్నారని ఎన్డీయే కూటమి నేతలు విమర్శిస్తున్నారు.

#cm vijay#tamilnadu assembly#delimitation bill#oppose resolution
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి