తెలంగాణ

BRS : మాది టీ హబ్.. రేవంత్‌ది అనుముల హబ్స్ : కేటీఆర్

రచన: Kumar•••4 నిమిషాల పఠనం

కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి మీద బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి సంచలన ఆరోపణలు, విమర్శలు చేశారు.ప్రస్తుతం రాష్ట్రంలో సంచలనం రేపిన భూముల కేటాయింపు విషయాన్ని ప్రస్తావించారు. సీఎం రేవంత్ తన తమ్ముడు కొండల్ రెడ్డి రూ.వందల కోట్లు విలువ చేసే భూమిని అప్పనంగా అప్పగించారని ఆరోపించారు. ఈ క్రమంలోనే బుధవారం ఎక్స్ వేదికగా ఆయన ట్వీట్ చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి మీద బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి సంచలన ఆరోపణలు, విమర్శలు చేశారు.ప్రస్తుతం రాష్ట్రంలో సంచలనం రేపిన భూముల కేటాయింపు విషయాన్ని ప్రస్తావించారు. సీఎం రేవంత్ తన తమ్ముడు కొండల్ రెడ్డి రూ.వందల కోట్లు విలువ చేసే భూమిని అప్పనంగా అప్పగించారని ఆరోపించారు. ఈ క్రమంలోనే బుధవారం ఎక్స్ వేదికగా ఆయన ట్వీట్ చేశారు.

‘మేము టీ-హబ్‌ను తీసుకొస్తే.. రేవంత్ రెడ్డి ‘అనుముల హబ్స్’ అనే పథకాన్ని తెచ్చాడు. జీరో ఇన్వెస్ట్‌మెంట్‌తో ‘టెస్సరాక్ట్ అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్’ అనే కంపెనీని స్థాపించి, రాత్రికి రాత్రే రూ.200 కోట్ల లాభం సంపాదించిన సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి ‘ఇన్నోవేటర్ ఆఫ్ ది సెంచరీ’ అవార్డు ఇవ్వాలి. మంత్రి శ్రీధర్ బాబు గారు,సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణలోని లక్షలాది యువతకు అలా ఎలా రూ.వందల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని ఎలా పొందాలో మ్యాజిక్ ట్రిక్ చెప్పాలి.మీరు అనుముల బ్రదర్స్‌లో ఒకరైతే, మీకు చాలా చీప్‌గా భూమి వస్తుంది, ఎలాంటి ప్రశ్నలు ఉండవు’ అని కేటీఆర్ పేర్కొన్నారు.

ఇదిలాఉండగా, కేవలం రూ.లక్షతో మొదలైన టెస్సెరాక్ట్ అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి నగరంలో రూ.200 కోట్ల విలువైన 5 ఎకరాల భూమిని కేటాయించి సీఎం అతి పెద్ద కుంభకోణానికి పాల్పడ్డాడు అని కేటీఆర్ నిన్న మీడియాకు వెల్లడించారు. టెస్సెరాక్ట్ అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి తాను చైర్మన్‌గా ఉన్నానని సీఎం సోదరుడు కొండల్ రెడ్డి లింక్డ్ఇన్ బయోలో పెట్టుకున్నాడని, రేవంత్ రెడ్డి సోదరులందరికీ పొట్ట కోస్తే అక్షరం ముక్క రాదని,

https://x.com/TeluguScribe/status/2087410748678914515?s=20

వీళ్ళందరూ ఉన్నట్లుండి కోట్లు బూట్లు వేసుకొని పెద్ద పెద్ద కంపెనీలకు చైర్మన్లు ఎలా అయ్యారు? అని ప్రశ్నించిన విషయం తెలిసిందే. టెస్సరాక్ట్ కంపెనీ ఫోన్ నంబర్ 12345678 అని రాసి ఉందని, ఇలాంటి నంబర్లు ఉండొచ్చని మాకు తెలీదని నిలదీశారు. ఆ కంపెనీలో కనీసం ఒక్క ఉద్యోగి కూడా లేడని, అలాంటప్పుడు రూ. వందల కోట్ల విలువైన భూమిని ఎలా ప్రభుత్వం ఎలా కేటాయించిందని కేటీఆర్ ప్రశ్నించారు.

#KTR#Cm revanth reddy#tessaract company#Land allocation#telangana
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి