Samantha: చాలా లాంగ్ గ్యాప్ తర్వాత సమంత నటించిన మా ఇంటి బంగారం సినిమా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటి 100 కోట్ల క్లబ్‌లో చేరింది. ఈ సందర్భంగా మేకర్స్ తాజాగా సెలబ్రేషన్స్ జరిపారు. ఈ కార్యక్రమంలో సమంత, భర్త రాజ్ నిడిమోరు, దర్శకురాలు నందిని రెడ్డి పాల్గొన్నారు. ఆ తర్వాత ఇచ్చిన ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో ఇకపై సినిమా అవకాశాలు రావనుకున్నానని.. కానీ, నేనే నిర్మాతగా సినిమాలు చేస్తున్నానని చెప్పింది.
నాగ చైతన్యతో విడాకుల తర్వాత సమంత అన్నీ రాకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంది. దీనికి తోడు మయో సైటసిస్ వ్యాధితోనూ చాలా బాధలు పడింది. అలాంటి, సమయంలో ఇక నన్ను నిర్మాతలెవరూ సినిమాలలోకి తీసుకోరేమోనని భయపడిందట. ఈ వ్యాధి వల్ల సమంత ఫిజిక్‌లో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. చూడటానికి కూడా అంత బాగోని స్థితికి వచ్చింది.
క్రమం తప్పకుండా మెడిసిన్, వ్యాయామం, ఆహార నియమాలు పాటించి మళ్ళీ మునుపటి సమంతలా తయారైంది. ఆ తర్వాత చేసిన సినిమానే మా ఇంటి బంగారం. ఇందులో సమంత ఫైట్స్ కూడా చేసింది. భార్యగా, కోడలిగా నటిస్తూనే.. విలన్స్‌తో ఫైట్స్, కార్ ఛేజింగ్స్ చేసింది. మా ఇంటి బంగారం సినిమాలో సమంతను చూసిన వారు షాకయ్యారు కూడా. అందుకే, ఈ సినిమా 100 కోట్లను రాబట్టి ఫీమేల్ సెంట్రిక్ మూవీస్ లో కొత్త రికార్డ్ ని క్రియేట్ చేసింది.
ఇక, సమంత ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో, ఆమె నటించిన ది ఫ్యామిలీ మేన్ 2, సీటాడెల్; హనీ బన్నీ వెబ్ సిరీస్ గురించి.. అందులో చేసిన యాక్షన్ సీక్వెన్సెస్ గురించి చెప్పుకొచ్చింది. దెబ్బలు తింటూ ఫైట్స్ చేస్తుంటే ఎంతో ఉత్సాహంగా అనిపించిందని సమంత చెప్పింది. ప్రస్తుతం, సోషల్ మీడియాలో సమంత అన్న మాటలు బాగా వైరల్ అవుతున్నాయి. కాగా, ప్రస్తుతం మెటర్నిటీ లీవ్‌లో ఉంది. స్క్రీన్ మీద కనిపించడానికి కొద్దిగా సమయం పడుతుంది. కానీ, స్క్రీన్ వెనకాల మాత్రం నిర్మాతగా యాక్టివ్‌గానే ఉంటోంది.












