తెలంగాణ

Telangana Govt: తెలంగాణలో మరో కొత్త పథకం.. మహిళలకు పూర్తిగా ఉచితం.. లక్షకు పైనే

రచన: NK••4 నిమిషాల పఠనం

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది. అన్ని వర్గాల ప్రజలను దృష్టిలో ఉంచుకుని స్కీమ్స్ తీసుకొచ్చింది. పథకాల ద్వారా ఆర్థిక సాయం కూడా అందిస్తోంది. తాజాగా బీసీ మహిళలను ఆర్థికంగా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వారి కోసం రేవంత్ ప్రభుత్వం కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. బీసీ మహిళలకు ఆటోమేటిక్ కుట్టు మిషన్లు పంపిణీ చేయనుంది. ఒక్కో నియోజకవర్గానికి వెయ్యి చొప్పున మొత్తం 1,19,000 కుట్టు మిషన్లను అందించనున్నారు.

Telangana Govt: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది. అన్ని వర్గాల ప్రజలను దృష్టిలో ఉంచుకుని స్కీమ్స్ తీసుకొచ్చింది. పథకాల ద్వారా ఆర్థిక సాయం కూడా అందిస్తోంది. తాజాగా బీసీ మహిళలను ఆర్థికంగా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వారి కోసం రేవంత్ ప్రభుత్వం కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. బీసీ మహిళలకు ఆటోమేటిక్ కుట్టు మిషన్లు పంపిణీ చేయనుంది.

ఒక్కో నియోజకవర్గానికి వెయ్యి చొప్పున మొత్తం 1,19,000 కుట్టు మిషన్లను అందించనున్నారు. రేపు సచివాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ పథకానికి ప్రారంభోత్సవం చేయనున్నారు. లబ్దిదారులపై ఎలాంటి ఆర్థిక భారం లేకుండా పూర్తిగా ప్రభుత్వ సబ్సిడీతో పథకం అమలు చేయనుంది సర్కార్.

బలహీన వర్గాల మహిళల ఆర్థిక ఎదుగుదలే కాంగ్రెస్ ప్రభుత్వం ధ్యేయం అని మంత్రి పొన్నం తెలిపారు. సీఎం రేవంత్ సూచన మేరకు మహిళల్లో స్వయం ఉపాధిని ప్రోత్సహించేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు ఆయన వెల్లడించారు. ఈ స్కీమ్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది మహిళలు స్వయం ఉపాధిని పొంది, ఆర్థికంగా స్థిరపడే అవకాశం లభిస్తుందన్నారు.

మహిళా సాధికారత దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తోందన్న మంత్రి పొన్నం.. ఈ స్కీమ్ ద్వారా నిరుపేద, బలహీన వర్గాల మహిళలకు ఒక భరోసా లభించినట్లు అవుతుందన్నారు. మహిళలు ఇంటి దగ్గరే ఉంటూ ఆదాయాన్ని పొందే అవకాశం లభిస్తుందని, తద్వారా ఆయా కుటుంబాల ఆర్థిక స్థితిగతులు మెరుగుపడతాయన్నారు.

రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గానికి 1,000 చొప్పున మొత్తం 1,19,000 ఆటోమేటిక్ కుట్టు మిషన్లను బీసీ మహిళలకు అందించనున్నారు.

#Telangana Govt#Sewing Machines#Stitching Machines#Ponnam Prabhakar#BC Women#Swechaa News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి