ఏపీ

Andhra Pradesh: డిప్యూటీ ఛైర్మన్‌ పదవికి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఖరారు.. జగన్‌ ప్లాన్‌ ఇదేనా?..

రచన: Venu••4 నిమిషాల పఠనం

తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్సీలతో జరిగిన సమావేశంలో మండలి డిప్యూటీ ఛైర్మన్‌ ఎన్నికపై జగన్‌ దిశానిర్దేశం చేశారు. మాధవరావు అభ్యర్థిత్వానికి పార్టీ ఎమ్మెల్సీలంతా పూర్తి మద్దతు ఇవ్వాలని సూచించారు.

ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలిలో ఖాళీగా ఉన్న డిప్యూటీ ఛైర్మన్‌ పదవిపై వైఎస్సార్‌సీపీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ పదవికి పార్టీ తరఫున తూమాటి మాధవరావును అభ్యర్థిగా ప్రతిపాదిస్తున్నట్లు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు.

తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్సీలతో జరిగిన సమావేశంలో మండలి డిప్యూటీ ఛైర్మన్‌ ఎన్నికపై జగన్‌ దిశానిర్దేశం చేశారు. మాధవరావు అభ్యర్థిత్వానికి పార్టీ ఎమ్మెల్సీలంతా పూర్తి మద్దతు ఇవ్వాలని సూచించారు. ఎన్నిక ప్రక్రియ సాఫీగా జరిగేలా ఎమ్మెల్సీలు సమన్వయంతో పనిచేయాలని జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు.

ప్రస్తుతం శాసనమండలిలో డిప్యూటీ ఛైర్మన్‌ పదవి ఖాళీగా ఉంది. త్వరలోనే ఈ పదవిని భర్తీ చేసేందుకు ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ ముందుగానే తమ అభ్యర్థిని ప్రకటించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే జగన్ నిర్ణయం వెనుక.. మండలిలో తమ పార్టీ బలాన్ని, ఎమ్మెల్సీల ఐక్యతను చాటుకునేందుకు ఈ ఎన్నికను ఒక అవకాశంగా మలచుకున్నట్టు కనిపిస్తోంది.

కేవలం ఒక పదవికి అభ్యర్థిని నిలబెట్టడం మాత్రమే కాకుండా.. పార్టీ ఎమ్మెల్సీలందరూ ఒకే మాటపై నిలబడేలా జగన్‌ స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం వెనుక రాజకీయ వ్యూహం ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.. మరోవైపు మాధవరావు అభ్యర్థిత్వంపై పార్టీ ఎమ్మెల్సీల నుంచి పూర్తి మద్దతు సాధించడంతో పాటు, ఎన్నికల సమయంలో ఎలాంటి సమన్వయ లోపాలు తలెత్తకుండా ముందస్తు వ్యూహంతో వైఎస్సార్‌సీపీ అడుగులు వేస్తోందని తెలుస్తుంది.

ముఖ్యంగా శాసనమండలిలో అధికార, ప్రతిపక్ష పార్టీల బలాబలాలు ఈ ఎన్నికలో కీలకంగా మారే అవకాశం ఉందంటున్నారు.. అయితే ఎన్నిక సమయంలో ఎలాంటి పరిణామాలు ఏపీ రాజకీయాల్లో చోటుచేసుకుంటాయి? ఇతర పార్టీల ఎమ్మెల్సీల వైఖరి ఎలా ఉంటుంది? మాధవరావుకు అవసరమైన మద్దతు సమీకరించడంలో వైఎస్సార్‌సీపీ ఏ మేరకు సఫలమవుతుంది? అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

#Andhra Pradesh#YSRCP#Deputy Chairman#Madhavarao#Y.S. Jagan Mohan Reddy#post finalized
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి