OG 2: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డాన్‌గా నటించిన సినిమా ఓజీ. సుజీత్ దర్శకత్వం వహించాడు. బాలీవుడ్ కిస్సుల వీరుడు ఇమ్రాన్ హష్మీ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి, విలన్ పాత్రలో ఆకట్టుకున్నాడు. పవన్ సరసన ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 300 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.
ఓజీ 2 సినిమా ఉందని పార్ట్ 1 క్లైమాక్స్‌లో దర్శకుడు సుజీత్ కన్‌ఫర్మ్ చేశాడు. అన్నట్టుగానే, ఇటీవల ఓజీ 2 కి సంబందించిన కథను నరేట్ చేసి త్వరలో సెట్స్‌పైకి తీసుకురాబోతున్నట్టుగా ప్రకటించారు. దీనికి, సంబందించి పవన్ కళ్యాణ్‌తో దర్శకుడు సుజీత్, మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఉన్న పిక్ కూడా వదిలారు. అన్నీ అనుకున్నటుగా పూర్తైతే ఈ నవంబర్ నుంచి ఓజీ 2 సెట్స్‌పైకి రానుంది.
అయితే, సుజీత్ మరో సినిమాను చేయడానికి రెడీగా ఉన్నాడు. నాని హీరోగా బ్లడీ రోమియో అనే సినిమాను కూడా ప్రకటించాడు. నాని కూడా అక్టోబర్ నుంచి ఫ్రీ అయిపోతాడు. కాబ్బట్టి, ముందు నాని సినిమాను పూర్తి చేసి, వచ్చే ఏడాది పవన్ కళ్యాణ్‌తో ఓజీ 2 మొదలుపెడతాడని మొన్నామధ్య వార్తలు వచ్చాయి. అయితే, పవన్, నాని లలో ఎవరు ఓకే అంటే వారితో సెట్స్‌పైకి రావడానికి సుజీత్ పక్కాగా స్క్రిప్ట్‌తో రెడీగా ఉన్నాడు.
పవన్ గనక రాజకీయాలతో బిజీగా ఉండి, హెల్త్ గనక పూర్తిగా సహకరించకపోయినా నానితో బ్లడీ రోమియోను మొదలు పెడతాడట. లేదంటే ముందు పవన్ కళ్యాణ్ తో ఓజీ 2 స్టార్ట్ చేసి ఆ తర్వాత నాని సినిమా షెడ్యూల్స్‌ను ప్లాన్ చేస్తాడట. ఒకవేళ రెండు సినిమాలు చేయాల్సి వస్తే కూడా సుజీత్ రెడీగా ఉన్నాడని తెలుస్తోంది. ఇటీవల కాలంలో ఒకేసారి సమాంతరంగా రెండు సినిమాలను చేసిన దర్శకుడు లేడు. అలా గనక సుజీత్ చేస్తే, ఆ రకంగా కూడా ఆయన హాట్ టాపిక్ అవుతాడు.












