తెలంగాణ

TG : మృత్యువుతో పోరాటం..అమెరికాలో తెలంగాణ వ్యక్తి మృతి

రచన: Kumar••4 నిమిషాల పఠనం

అమెరికాలో జరిగిన ప్రమాదంలో గత రెండు వారాలుగా ప్రాణాలతో పోరాడిన తెలంగాణ వాసి మృతి చెందాడు.ఉన్నత చదువులు, ఉద్యోగం, మంచి భవిష్యత్ కోసం పుట్టిన ఊరు, కన్నతల్లిదండ్రులను వదిలేసి వెళ్తున్న విద్యార్థులు, ఉద్యోగుల జీవితాలు మధ్యలోనే ముగిసిపోతున్నాయి.

అమెరికాలో జరిగిన ప్రమాదంలో గత రెండు వారాలుగా ప్రాణాలతో పోరాడిన తెలంగాణ వాసి మృతి చెందాడు.ఉన్నత చదువులు, ఉద్యోగం, మంచి భవిష్యత్ కోసం పుట్టిన ఊరు, కన్నతల్లిదండ్రులను వదిలేసి వెళ్తున్న విద్యార్థులు, ఉద్యోగుల జీవితాలు మధ్యలోనే ముగిసిపోతున్నాయి. ఈ మధ్యకాలంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు వరుసగా ప్రమాదాలకు గురవుతున్నారు. కొందరు ప్రమాదాలకు గురవుతుంటే మరికొందరు అమెరికాలోని కొందరు దుండగుల దాడులు, కాల్పుల్లో మరణిస్తున్నారు.

అమెరికాలో సేఫ్టీ చాలా బాగుంటుందని, భద్రతకు ఫస్ట్ ప్రయారిటీ ఉంటుందని చెబుతుంటారు.అలాంటి చోట ఇలాంటి ప్రమాద ఘటనలు, హత్యదోపిడీలు చోటుచేసుకుంటుండటంతో ఉన్నత చదువులకోసం యూఎస్ వెళ్లేందుకు చాలా మంది జంకుతున్నారు.అయితే, అమెరికాలో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి తెలంగాణ రాష్ట్రంలోని హన్మకొండ జిల్లాకు చెందినవాడిగా గుర్తించారు.

అమెరికాలోని ఫ్లోరిడాలో జులై 25వ తేదీన జరిగిన అగ్నిప్రమాదంలో హన్మకొండ జిల్లా హసన్‌పర్తి మండలం గంటూర్‌పల్లికి చెందిన భరత్ చందర్ రెడ్డి అనే విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. 75 శాతం కాలిన గాయాలతో ఉన్న అతన్ని వెంటనే ఆసుపత్రిలో చేర్పించగా.. గత 15 రోజులుగా మృత్యువుతో పోరాడి భారత కాలమానం ప్రకారం ఇవాళ ఉదయం కన్నుమూసినట్టు తెలుస్తోంది.

భరత్ చందర్ రెడ్డి తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు. కొడుక్కి ఉన్నత చదువులు చెప్పించేందుకు 2023లో అమెరికాకు పంపించారు. యూఎస్ నుంచి తిరిగి వచ్చి వివాహం చేసుకుందాం అనుకునే సమయానికి అనుకోని ప్రమాదంలో భరత్ చనిపోయాడు. ఉన్నదంతా ఖర్చు చేసినా కొడుకును కాపాడుకోలేకపోయామని తల్లిదండ్రుల ఆవేదన వ్యక్తంచేస్తున్నాడు. కొడుకు డెడ్ బాడీని తీసుకువచ్చేలా సాయం చేయాలని ప్రభుత్వాన్ని వేడుకున్నారు.

https://x.com/TeluguScribe/status/2087407656600469929?s=20

#America fire accident#telangana#student dead#burn injury
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి