తెలంగాణ

Telangana: బొమ్మరాసిపేట్ భూములపై మంత్రి పొంగులేటి ఆరా?

రచన: Venu••5 నిమిషాల పఠనం

40 మందికి 80 నోటీసులు జారీ చేసిన వ్యవహారంలో తదుపరి ఏం జరగబోతోందన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే నోటీసులు అందుకున్న వారితో పాటు, ఇంకా ఎవరెవరికి నోటీసులు ఇవ్వాలన్న దానిపై అధికారులు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.

- కోర్టు కేసుల మాటున అక్రమ పాస్ బుక్ లపై ఆధారాలతో స్వేచ్ఛ న్యూస్ వరుస కథనాలు

- వెయ్యి ఎకరాలు అప్పనంగా కొట్టేయొచ్చని ఆంధ్రా భూ మాఫియా ప్లాన్?

- కనిపించిన వారికల్లా ఎకరాలు రాసి ఇస్తామని హామీ

- అసలు విషయాలు తెలియక బోల్తా పడుతున్న నేతలు, వ్యాపారవేత్తలు

- అగ్రిమెంట్ల రూపంలో కోట్ల రూపాయలు వసూలు చేసిన యుగేంధర్ చౌదరి, ఆదిత్య యాదవ్

- ఇప్పటికైనా ఎవరి భూమి నిజమైన పట్టాలో ఉందో తెలుసుకున్నారా?

ఛైర్మన్ స్వేచ్ఛ న్యూస్

దేవేందర్ రెడ్డి చింతకుంట్ల

9848070809

పక్కా ఆధారాలతోనే స్వేచ్ఛ కథనాలు..

మేడ్చల్ జిల్లాలో రెవెన్యూ అధికారుల అక్రమ వ్యవహారంపై స్వేచ్ఛ న్యూస్ వార్తలు రాస్తూనే ఉంది. గతంలో బాచుపల్లిలో మైరాన్ మాల్ పేరుతో యువరాజ్ చేసిన భూ వ్యవహారం కుండబద్దలు కొట్టినట్లు రాసింది. సీలింగ్ ఫైల్ మాయం, ఎన్నో వ్యవహారాలు నడిపించినా, చివరికి నిజం ఏంటో తేలిపోయింది. టైటిల్ ఎవరికి ఉందో తెలుసుకున్నట్లు సమాచారం. తాజాగా బొమ్మరాసిపేట్ లో 60 ఏండ్లుగా జరిగిన సేల్ డీడ్స్ , ఇనాం భూముల వ్యవహారం, సీలింగ్ డిక్లరేషన్స్ ఏమీ పట్టించుకోకుండా, 60 ఎకరాల ఫేక్ డాక్యుమెంట్స్ పేరుతో వెయ్యి ఎకరాలు కొట్టేయాలని భూ కబ్జాదారులు చూస్తున్నారు.

ఇదే విషయాన్ని ఆధారాలతో సహా స్వేచ్ఛ న్యూస్ ఇప్పటివరకు 5 ఇన్వెస్టిగేషన్ కథనాలు అందించింది. ఈ నేపథ్యంలో 10 రోజులు ఫ్యామిలీతో విదేశీ పర్యటనలో ఉన్న కలెక్టర్ మను చౌదరి మంగళవారం మంత్రి పొంగులేటిని కలిసినట్లు సమాచారం. బొమ్మరాసిపేట్ లో ఏం జరుగుతోంది? ఎవరు తప్పుదారి పట్టించారు? ఇంత స్టోరీ ఉన్నట్లు ఎందుకు తెలియలేదని ఆరా తీసినట్లు సమాచారం. కోర్టు స్టే లేని భూముల విచారణ, పాస్ బుక్ ల మార్పిడి ఎంత వరకు వచ్చిందనే సమాచారం రాబట్టినట్టు తెలుస్తోంది.

ఇక తాజాగా 40 మందికి 80 నోటీసులు జారీ చేసిన వ్యవహారంలో తదుపరి ఏం జరగబోతోందన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే నోటీసులు అందుకున్న వారితో పాటు, ఇంకా ఎవరెవరికి నోటీసులు ఇవ్వాలన్న దానిపై అధికారులు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఈ ప్రక్రియ పూర్తయ్యాక.. అందరికీ ఒకేసారి నోటీసులు జారీ చేసి, తదుపరి చర్యలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు వినికిడి.

ధర్నాకు సిద్దమవుతున్న గ్రామం

మరోవైపు కోర్టు కేసు పేరుతో జీపీఏ హోల్డర్స్‌గా అప్లికేషన్లు పెట్టుకున్న వారికి.. వారు పొజిషన్‌లో లేకపోయినా పాస్‌బుక్‌లు జారీ చేయడంపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మార్వో తీరును, ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించేందుకు గ్రామస్తులు సిద్ధమవుతున్నారు. గతంలోనూ అమోయ్ కుమార్ కూడా ఇదే తరహాలో అక్రమ రిజిస్ట్రేషన్లకు ప్రయత్నించగా.. ఉద్యమం ద్వారానే అడ్డుకున్నామని వారు చెబుతున్నారు.

ఇప్పుడు మళ్లీ ఇలాంటి చిల్లర వ్యవహారాలకు తావులేకుండా.. భూ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించేలా దీర్ఘకాలిక ఉద్యమం చేపడతామని 40 ఏళ్లుగా పట్టా పాస్‌బుక్‌లు కలిగి ఉన్న రైతులు, 12 ఏళ్ల క్రితమే నాలా కన్వర్షన్ చేసుకున్న వ్యాపారవేత్తలు హెచ్చరిస్తున్నారు.

#Telangana#Medchal#Minister Ponguleti#Bommarasipet#lands Encroachment
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి