సినిమా

Actress: చిన్న వయస్సులోనే స్టార్ డమ్ అందుకొని అండర్ వరల్డ్ దెబ్బకు పారిపోయిన హీరోయిన్!..

రచన: Venu•••6 నిమిషాల పఠనం

సూపర్ స్టార్ కృష్ణ తనయుడు, మహేష్ బాబు అన్న రమేష్ బాబు 1987లో నటించిన సామ్రాట్ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు హీరోయిన్‌గా పరిచయమైంది. మంచి అందగత్తె అవడంతో అప్పటి కుర్రాళ్లకు తెగ నచ్చేసింది.. తన సోయగంతో మతులు పోగొట్టింది.

సినిమా అనే మెరుపుల ప్రపంచంలో ఉన్న ఆకర్షణ బహుశ మరే లోకంలో ఉండదు కావచ్చు. ఒకప్పుడు లోకానికి తెలియని వారు కూడా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాక రాత్రికి రాత్రే సెలబ్రెటీ హోదా అందుకున్న వాళ్ళు ఉన్నారు.. ముఖ్యంగా మాయ ప్రపంచంతో పోల్చే సినీలోకంలో తెరపై హీరోయిన్ల తళుకుల వెనుక ఎంతో వేదన ఉంటుందని కొందరు హీరోయిన్స్ గా, ఆర్టిస్టు గా మారిన వారు అనడం తెలిసిందే.

అయితే ఎంత వేగంగా స్టార్ డమ్ అందుకున్నారో అంతే వేగంగా తెరమరుగు అయిన హీరోయిన్స్ కూడా ఉన్నారు. అలాంటి వారిలో సోనమ్ ఒకరు.. సుమారు పదిహేనేళ్ల వయస్సులోనే ఇండస్ట్రీలోకి వచ్చిన ఈమె.. అనతి కాలంలోనే డిమాండ్ ఉన్న హీరోయిన్ గా మారింది. ఇప్పటి కుర్రకారుకి ఈ భామ అంతగా గుర్తు ఉండకపోవచ్చు.. ఇక సోనమ్ అసలు పేరు భక్తవర్ ఖాన్.

1972లో జన్మించిన ఈ అమ్మడు.. సూపర్ స్టార్ కృష్ణ తనయుడు, మహేష్ బాబు అన్న రమేష్ బాబు 1987లో నటించిన సామ్రాట్ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు హీరోయిన్‌గా పరిచయమైంది. మంచి అందగత్తె అవడంతో అప్పటి కుర్రాళ్లకు తెగ నచ్చేసింది.. తన సోయగంతో మతులు పోగొట్టింది. ఆ తరువాత హఠాత్తుగా మాయం అయ్యింది. తరువాత కృష్ణ నటించిన ముగ్గురు కొడుకులు సినిమాలో మెరిసింది.. తరువాత రెండేళ్లకు చిరంజీవి సరసన కొదమసింహంలో కనిపించింది.

తర్వాత బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సోనమ్.. కేవలం రెండు సంవత్సరాల్లోనే 20కి పైగా చిత్రాల్లో నటించి రికార్డు సృష్టించింది. అందులో అమితాబ్ బచ్చన్, సన్నీ డియోల్, గోవిందా, సంజయ్ దత్, చంకీ పాండే వంటి టాప్ హీరోల సరసన నటించి మెప్పించింది. మరోవైపు 1988లో విడుదలైన 'విజయ్' సినిమా ఈ భామకు మంచి పేరు తెచ్చిపెట్టింది. మిత్ జాయే గమ్ వంటి పాటలు, డ్యాన్సులు అప్పట్లో యువతను ఉర్రూతలూగించాయి.

అయితే కెరీర్ పరంగా ఫుల్ ఫామ్ లో ఉండగానే వ్యక్తిగత నిర్ణయాలతో సినిమా ఇండస్ట్రీకి దూరం అయ్యింది. 19 ఏళ్ల వయసులోనే తనకంటే 17 ఏళ్లు పెద్దవాడైన ప్రముఖ దర్శకుడు రాజీవ్ రాయ్‌ను ఆమె వివాహం చేసుకుంది. ఇతను ఆమె నటించిన త్రిదేవ్, విశ్వాత్మ సినిమాల దర్శకుడు.. వివాహం జరిగిన మరుసటి ఏడాది లోనే తల్లి అయిన సోనమ్ పూర్తిగా ఫ్యామిలీ లైఫ్‌కి ప్రాధాన్యం ఇచ్చింది.

కానీ జీవితం ఊహించినట్టు సాగాదు కదా!.. ముంబై అండర్ వరల్డ్‌తో ఏదో గొడవ, రాజీవ్ మీద అబూసలేం గ్యాంగ్ హత్యాయత్నం.. ఆ దెబ్బకు ఈ దంపతులకు బాలీవుడ్ వదిలేసి. దేశం కూడా విడిచిపెట్టాల్సిన పరిస్థితులు తలెత్తాయని ప్రచారం జరిగింది. అలాగే వాళ్ళ కొడుకుకి ఆటిజం సమస్య ఉందని వార్తలు కూడా వచ్చాయి. మొత్తానికి ఈ కారణంగా చికిత్స కోసం యూరప్‌లోనే స్థిరపడ్డట్టు కొన్ని పత్రికలు కథనాలు ప్రచురించాయి.

కానీ కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు కదా.. వైవాహిక జీవితం బీటలు బారింది. ఫలితంగా 2001లో రాజీవ్, సోనమ్ విడిపోయారు, 2016లో అధికారికంగా విడాకులు తీసుకున్నారు. తర్వాత 2017లో మురళి పొడువాల్ అనే ఓ ఆర్థోపెడిక్ సర్జన్ ను పెళ్లి చేసుకుంది.. ఇక ముంబైలో జియో వరల్డ్ ప్లాజా ప్రారంభోత్సవం దగ్గర 2023లో కనిపించింది.. అంటే దాదాపుగా 30 ఏళ్లుగా ఆమె ఎవరికీ కనిపించలేదు..

మరోవైపు ఆమె కొడుకుతో ప్రస్తుతం ముంబైలో ఉంటున్న సోనమ్ తన వయస్సుకు తగిన పాత్రలు, ఓటీటీ, వెబ్ సీరీస్‌లు వస్తే నటిస్తానని ఓ ఇంటర్వ్యూలో చెప్పినట్టు కధనాలు వచ్చాయి. ఇక 80, 90లలో బాలీవుడ్ ప్రపంచంలో అగ్ర కథానాయికగా చక్రం తిప్పిన ఈ మాజీ హీరోయిన్ కు ఇప్పుడు అవకాశాలు వస్తాయా? అనేది సినీ సర్కిల్ల్ లో ఆసక్తికరంగా మారింది.

#Tollywood#Bollywood#Actress#sonam-khan#Rajiv Rai
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి