Vishwak Sen: ఏపీలో ‘అర్ణబ్’ తుఫాన్ విళయతాండవం ఆడుతున్న వేళ ఎన్నో కుటుంబాలకు తీవ్ర నష్టం కలుగుతోంది. ఈ నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాధితులకు అండగా ఉంటామని హామీ ఇస్తూ..వారికి అవసరమైన సదుపాయాలను కల్పించడంలో నిమగ్నమై ఉన్నారు. ఈ నేపథ్యంలో చిత్రపరిశ్రమ నుంచి కూడా పలువురు సంఘీభావం తెలుపుతూ అండగా ఉంటామని హామీ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే బాధితుల కోసం యంగ్ హీరో విశ్వక్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు.
మన దేశంలో మరీ ముఖ్యంగా, మన రెండు తెలుగు రాష్ట్రాలలో ఎలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినా వెంటనే స్పందిస్తుంది తెలుగు చిత్రపరిశ్రమ. మన సినీ స్టార్స్ అందరూ తమ వంతు సహాయంగా బాధితులను ఆదుకుంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి దగ్గర్నుంచి సంపూర్ణేష్ బాబు లాంటి వాళ్ళ వరకూ ప్రతీ ఒక్కరు ఇలాంటి కష్టకాలంలో ప్రజలకి, అభిమానులకు అండగా నిలుస్తున్నారు.
విశ్వక్ సేన్ కూడా తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఆయన హీరోగా నటించిన 'కల్ట్' సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో రేపు (29.10.2026) గ్రాండ్‌గా ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించాల్సి ఉండగా, ఈ ఈవెంట్‌ను రద్దు చేస్తున్నట్టుగా విశ్వక్ తెలిపాడు. ఆంధ్రప్రదేశ్‌లో ‘అర్ణబ్’ తుఫాన్ సృష్టిస్తున్న తీవ్ర నష్టాన్ని దృష్టిలో పెట్టుకొని కల్ట్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను రద్దు చేస్తున్నామని అధికారికంగా ప్రకటించారు. ఓ వీడియో ద్వారా హీరో విశ్వక్ తెలిపాడు. అంతేకాదు, ఈ విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్న బాధితులకి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. జస్ట్ ఒక ప్రెస్ మీట్ నిర్వహించి ట్రైలర్ రిలీజ్ చేస్తామని తెలిపాడు.
ఆదర్శకుటుంబం వాయిదా పడుతుందా?
మాటల మాంత్రీకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, విక్టరీ వెంకటేష్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ఆదర్శకుటుంబ సినిమాను ఈ 30న రిలీజ్ కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మేకర్స్ తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. అయితే, ఆంధ్రప్రదేశ్‌లో ‘అర్ణబ్’ తుఫాన్ సృష్టిస్తున్న క్లిష్ట పరిస్థితుల కారణంగా ఆదర్శకుటుంబం చిత్రాన్ని వాయిదా వేయాలనే ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. దీనిపై, అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది. ఒకవేళ సినిమాను గనక విడుదల చేస్తే ఒక్క తెలంగాణలో ప్రేక్షకులు చూడగలరు తప్ప ఏపీలో ఆ పరిస్థితి లేదని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.


