సినిమా

Jailer-2: నాగవంశీకి ఏమీ మిగల్లేదా..?

రచన: Anshu••4 నిమిషాల పఠనం

Jailer-2: సినిమా చేసేది హీరో, తీసేది దర్శకుడు, ఖర్చు పెట్టేది నిర్మాత. కొనేది పంపిణీ దారుడు..ఇలా ఒక సినిమా మార్కెట్‌లోకి రావడానికి మూలాలు. అయితే, నిర్మాత దగ్గర కొన్న తర్వాత డిస్ట్రిబ్యూటర్ కి వచ్చే లాభ నష్టాలతో ఆ నిర్మాతకి పనిలేదు. లాభం వచ్చినప్పుడు పంచుకోడు..నష్టం వచ్చినప్పుడు ఆదుకోడు. ఇలాంటి వ్యవహారల మధ్య సినిమా వ్యాపారం జరుగుతుంది. అయితే, ఇటీవల వచ్చిన జైలర్ 2 సినిమాను తెలుగులో విడుదల చేసిన నాగవంశీకి మాత్రం ఏమీ మిగల్లేదట.

తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘జైలర్ 2’. ఈ సినిమాను తమిళంతో పాటుగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ విడుదల చేశారు. అంతేకాదు, తమిళ సినిమా అయినా కూడా మన ఏపీలో టికెట్ హైక్ కూడా ఇవ్వడం విశేషం. ఇక, జైలర్ కంటే కూడా జైలర్ 2 మూవీ భారీ విజయాన్ని అందుకుంది. దసరా పండుగ సీజన్‌లో రావడం పెద్ద ప్లస్ పాయింట్.

అంతేకాదు, టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన ‘రణబలి’తో పోటీగా వచ్చిప్పటికీ, డే 1 నుంచే థియేటర్లలో రికార్డు స్థాయిలో వసూళ్లను రాబట్టింది. ఏపీ, తెలంగాణలలో భారీ స్థాయిలో కలెక్షన్లు రాబట్టిన డబ్బింగ్ సినిమాలలో ఒకటిగా నిలిచింది. అయితే, బాక్సాఫీస్ వద్ద ఈ స్థాయిలో సంచలన విజయం సాధించినప్పటికీ.. జైలర్ 2 చిత్ర తెలుగు హక్కులను దక్కించుకున్న టాలీవుడ్ ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీకి మాత్రం ఎంతమాత్రం లాభాలు రాలేదని తెలుస్తోంది.

వాస్తవానికి, జైలర్ 2 సినిమా తెలుగు థియేట్రికల్ హక్కులను నాగవంశీ భారీగా వెచ్చించి ఫ్యాన్సీ ధరకు దక్కించుకున్నారు. తమిళంలో జైలర్ 1 సాధించిన సక్సెస్‌ను దృష్టిలో పెట్టుకొని జైలర్ 2ని కొన్నారు. ఇంతవరకూ బాగానే ఉంది గానీ, ఇంతకముందు తన బ్యానర్‌లో వచ్చిన కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని చూడటంతో, ఆ సినిమాలు తీసుకున్న డిస్ట్రిబ్యూటర్లు భారీగా నష్టపోయారు. దీంతో, జైలర్ 2 ని తక్కువ ధరకే విక్రయించారట నాగవంశీ. ఇక్కడ, ఎగ్జిబిటర్స్ మంచి లాభాలు పొందినప్పటికీ..డిస్ట్రిబ్యూటర్‌గా నాగవంశీ మాత్రం లాభాలను చూడలేదని తెలుస్తోంది.

#Jailer 2#Suryadevara Nagavamshi#Rajinikanth#Nelson Dilip Kumar
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి