ఏపీ

AP: తీరం వైపు 'అర్నబ్'.. ఉత్తరాంధ్రకు ఫ్లాష్ ఫ్లడ్స్ ముప్పు!

రచన: Mahesh••3 నిమిషాల పఠనం

AP: బంగాళాఖాతంలో ఏర్పడిన ‘అర్నబ్’ తుపాను తీరం వైపు శరవేగంగా దూసుకొస్తోంది. ప్రస్తుతానికి ఈ తీవ్ర తుపాను కాస్త బలహీనపడి సాధారణ తుపానుగా మారినప్పటికీ, ఉత్తరాంధ్ర జిల్లాలకు మాత్రం పెను ముప్పు పొంచే ఉంది. ఈ రోజు రాత్రికి ఇది మరింతగా బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతున్నా..

AP: బంగాళాఖాతంలో ఏర్పడిన ‘అర్నబ్’ తుపాను తీరం వైపు శరవేగంగా దూసుకొస్తోంది. ప్రస్తుతానికి ఈ తీవ్ర తుపాను కాస్త బలహీనపడి సాధారణ తుపానుగా మారినప్పటికీ, ఉత్తరాంధ్ర జిల్లాలకు మాత్రం పెను ముప్పు పొంచే ఉంది. ఈ రోజు రాత్రికి ఇది మరింతగా బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతున్నా.. దీని ప్రభావంతో ఒక్కసారిగా విరుచుకుపడే ఆకస్మిక వరదలు (ఫ్లాష్ ఫ్లడ్స్) స్థానికంగా తీవ్ర భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి.

ఆ జిల్లాల్లో కుండపోత..

‘అర్నబ్’ ప్రభావంతో గురువారం శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోనుంది. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వానలు పడనుండగా.. ఒకటి రెండు ప్రాంతాల్లో కుండపోత వర్షాలు ముంచెత్తే సూచనలు కనిపిస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా ఉన్నట్టుండి వాగులు, వంకలు పొంగిపొర్లి ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే ప్రమాదం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో ఉండే జనం క్షణక్షణం అప్రమత్తంగా ఉంటూ అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు.. రాడార్ నిఘా!

భారీ వర్షాలకు తోడు తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీచే అవకాశం ఉంది. బలమైన ఈదురుగాలుల ధాటికి చెట్లు విరిగిపడే ప్రమాదం ఉండటంతో ప్రజలు సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలని అధికారులు స్పష్టం చేస్తున్నారు. మరోవైపు ఈ తుపాను కదలికలను అధికారులు డోప్లర్ వెదర్ రాడార్ ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. అత్యవసర పరిస్థితులు ఎదురైతే తక్షణ సహాయక చర్యలు చేపట్టేందుకు అధికార యంత్రాంగం రంగంలోకి దిగింది.

#Arnab Cyclone#Arnab Cyclone News#Arnab Storm#Andhra Pradesh#AP News#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి