సినిమా

Tollywood: రన్‌టైమ్ సినిమాకి రిస్క్ అవుతుందా?

రచన: Anshu••4 నిమిషాల పఠనం

విక్టరీ వెంకటేష్ నటించిన లేటెస్ట్ సినిమా ఆదర్శకుటుంబం తాజాగా, సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. పర్‌ఫెక్ట్ రన్‌టైమ్ తో ప్రేక్షకుల ముందుకు అక్టోబర్ 30న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మొదటిసారి వెంకీ హీరోగా నటించిన ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. సామాన్యుడు తెగిస్తే ఏకే 47 అవుతాడనే పాయింట్‌తో తెరకెక్కిన సినిమాను కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందించారు. 2 గంటల 29 నిముషాల నిడివితోనే మన ముందుకు వస్తోంది.

Tollywood: కథలో బలముంటే..3 గంటల సినిమాను కూడా ప్రేక్షకులు ఆదరిస్తారు. ఈ విషయం ఇప్పుడు కాదు, బ్లాక్ అండ్ వైట్ కాలం సినిమాలతోనే ప్రూవ్ అయింది. 4 గంటలకి పైగా ఉన్న సినిమాలకి రెండు ఇంట్రవెల్స్ ఇచ్చి ప్రదర్శించారు. అలాంటి, సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్నాయి. ఆ తర్వాత, 2 గంటలపైగా నిడివితో వచ్చాయి. మళ్ళీ, గత కొంతకాలంగా కొన్ని సినిమాలు మూడు గంటల రన్‌టైమ్ తో వస్తున్నాయి. వీటిలో కొన్ని హిట్ అయితే, కొన్ని డిజాస్టర్ అవుతున్నాయి.

విక్టరీ వెంకటేష్ నటించిన లేటెస్ట్ సినిమా ఆదర్శకుటుంబం తాజాగా, సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. పర్‌ఫెక్ట్ రన్‌టైమ్ తో ప్రేక్షకుల ముందుకు అక్టోబర్ 30న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మొదటిసారి వెంకీ హీరోగా నటించిన ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. సామాన్యుడు తెగిస్తే ఏకే 47 అవుతాడనే పాయింట్‌తో తెరకెక్కిన సినిమాను కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందించారు.

ఇప్పటికే, ఈ సినిమా నుంచి వచ్చిన సాంగ్స్, ఇతర ప్రమోషనల్ కంటెంట్ మంచి బజ్ క్రియేట్ చేసింది. ఏపీలో ఈ సినిమాకి టికెట్ హైక్ ఇచ్చారు. కానీ, అది కామన్ ఆడియన్స్‌ను దృష్టిలో పెట్టుకొనే చాలా తక్కువ మొత్తంలోనే ధరలను పెంచారు. ఇది, ఆదర్శకుటుంబం సినిమాకి బాగా కలిసి వచ్చే అంశం అయితే, రన్‌టైమ్ మరో పెద్ద ప్లస్ పాయింట్ అని తాజాగా సెన్సార్ పూర్తయ్యాక అర్థమైంది. 2 గంటల 29 నిముషాల నిడివితోనే మన ముందుకు వస్తోంది.

ఈ మధ్య కాలంలో రన్‌టైమ్ వల్లే ఫెల్యూవర్ అయిన సినిమాలున్నాయి. అదనంగా ఉన్న అరగంట ట్రిమ్ చేస్తే హిట్ అయ్యే సినిమాలున్నాయి. కానీ, మేకర్స్ ఎక్కడో కాంప్రమైజ్ కాక నష్టపోయినవాళ్ళున్నారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని మేకర్స్ ఆదర్శకుటుంబం రన్‌టైమ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. మరి, మంచి అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమా ఎలాంటి లాభాలను నిర్మాతలకి తెస్తుందో చూడాలి. కాగా, థమన్ సంగీతం అందించిన ఈ సినిమాలో కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించింది. కీలక పాత్రల్లో నివేథా పేతురాజ్, డింపుల్ హయాతి కీలక పాత్రల్లో నటించారు.

#Aadarsha Kutumbam House No: 47#Venkatesh#Trivikram#Srinidhi Setty
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి