తెలంగాణ

ఢిల్లీకి సీఎం రేవంత్.. ఇన్వెస్ట్ తెలంగాణ సమ్మిట్ కర్టెన్ రైజర్ కార్యక్రమానికి హాజరు

రచన: NK•••3 నిమిషాల పఠనం

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం ఢిల్లీ వెళ్లనున్నారు. అక్కడ ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ కర్టెన్ రైజర్ కార్యక్రమంలో పాల్గొననున్నారు.

Cm Revanth: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం ఢిల్లీ వెళ్లనున్నారు. అక్కడ ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ కర్టెన్ రైజర్ కార్యక్రమంలో పాల్గొననున్నారు. తెలంగాణలో అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో ఢిల్లీలో ‘ఇన్వెస్ట్‌ తెలంగాణ గ్లోబల్‌ సమ్మిట్‌-2026’ కర్టెన్‌ రైజర్‌ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహించనుంది. సీఎం రేవంత్‌, పలు దేశాల రాయబారులు, దౌత్యవేత్తలు, గ్లోబల్‌ కంపెనీల సీఈవోలు, ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు, అంతర్జాతీయ ప్రోత్సాహక ఏజెన్సీల ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు.

డిసెంబర్ లో గ్లోబల్ సమ్మిట్

డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో హైదరాబాద్‌లోని భారత్‌ ఫ్యూచర్‌ సిటీలో గ్లోబల్‌ సమ్మిట్‌ నిర్వహించనున్నారు. అంతర్జాతీయ పెట్టుబడిదారులను సమ్మిట్‌కు ఆహ్వానించడంతో పాటు తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ఉన్న అవకాశాలను వివరించేందుకు ఢిల్లీలో కర్టెన్ రైజర్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు.

పెట్టుబడులు ఆకర్షించే లక్ష్యం

రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేస్తున్న పారిశ్రామిక అనుకూల విధానాలు, భవిష్యత్‌ అభివృద్ధి ప్రణాళికలు, ఐటీ, ఫార్మా, రక్షణ, ఏరోస్పేస్‌ రంగాల్లోని అవకాశాలను గ్లోబల్ ఇన్వెస్టర్లకు వివరించేందుకు ఈ వేదికను ప్రభుత్వం కీలకంగా మలచుకోనుంది. గ్లోబల్‌ సమ్మిట్‌కు విస్తృత ప్రచారం కల్పించేందుకు,

ప్రపంచ పారిశ్రామిక వర్గాల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పలు దేశాల్లో రోడ్‌ షోలు నిర్వహిస్తోంది. ఢిల్లీతో పాటు ముంబై, బెంగళూరు వంటి ప్రధాన మెట్రో నగరాల్లోనూ ఇన్వెస్ట్ తెలంగాణకు విస్తృత ప్రచారం కల్పిస్తున్నారు. ఈ సదస్సుకు కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్ట్రీ (సీఐఐ), ఇన్వెస్ట్‌ ఇండియా సంస్థలు భాగస్వాములుగా వ్యవహరించనున్నాయి.

#Cm Revanth#Delhi Tour#Invest Telangana Global Summit 2026#Investments#Swechaa News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి