తెలంగాణ

TG: కేటీఆర్‌ నన్ను వేధిస్తున్నాడు.. బల్మూరి ఇందూజ సంలచన ఆరోపణలు

రచన: Mahesh••4 నిమిషాల పఠనం

TG: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) చిక్కుల్లో పడ్డారు. తనపై సోషల్ మీడియా వేదికగా అసత్య ప్రచారాలు చేయిస్తూ తీవ్ర వేధింపులకు గురిచేస్తున్నారంటూ తెలంగాణ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి బల్మూర్ ఇందుజా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్‌ను ఆశ్రయించారు.

TG: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) చిక్కుల్లో పడ్డారు. తనపై సోషల్ మీడియా వేదికగా అసత్య ప్రచారాలు చేయిస్తూ తీవ్ర వేధింపులకు గురిచేస్తున్నారంటూ తెలంగాణ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి బల్మూర్ ఇందుజా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్‌ను ఆశ్రయించారు. కేటీఆర్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ సీపీకి లిఖితపూర్వక ఫిర్యాదు సమర్పించడం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.

సోషల్ మీడియాలో టార్గెట్.. తీవ్ర వేధింపులు

తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా బీఆర్‌ఎస్ శ్రేణులు, కేటీఆర్ అనుచరులు సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడుతూ నిరంతరం మానసిక వేదనకు గురిచేస్తున్నారని ఇందుజా తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కేటీఆర్ ఆదేశాలు, సపోర్ట్‌తోనే నెట్టింట తనపై ఈ స్థాయి దాడి జరుగుతోందని ఆమె ఆరోపించారు. ఒక మహిళా నేత అని కూడా చూడకుండా కించపరిచేలా వ్యవహరిస్తున్నారని, ఇది ముమ్మాటికీ ఎస్సీ, ఎస్టీ వర్గానికి చెందిన మహిళపై జరుగుతున్న అణచివేతేనని స్పష్టం చేశారు.

కేటీఆర్‌పై చర్యలు తీసుకోవాల్సిందే..

ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించి, బాధ్యులైన వారిపై వెంటనే చర్యలు ప్రారంభించాలని సీపీ సజ్జనార్‌ను ఆమె కోరారు. కేటీఆర్‌పై అట్రాసిటీ సెక్షన్ల కింద కేసు బుక్ చేసి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధిగా ఉంటూ ఇలాంటి చర్యలను ప్రోత్సహించడం సరికాదని, పోలీసు వ్యవస్థ తక్షణమే స్పందించి తనకు న్యాయం చేయాలని ఆమె కోరారు. రాష్ట్రంలో ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరిన వేళ, నేరుగా కేటీఆర్‌ను టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ మహిళా నేత పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేయడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఫిర్యాదుపై నగర పోలీసులు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

#Telangana#Telangana News#TG News#Telangana Politics#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి