సినిమా

Tollywood: మెగావర్స్‌కి హోస్ట్‌గా మెగాస్టార్..గెస్టులుగా సౌత్ స్టార్స్!

రచన: Anshu•••4 నిమిషాల పఠనం

Tollywood: మెగాస్టార్ చిరంజీవి మరోసారి హోస్ట్‌గా వ్యవహరించబోతున్నారు. ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ లో ఈ కార్యక్రమం స్ట్రీమింగ్ కోసం రెడీ అవుతోంది. చాలాఏళ్ళ తర్వాత మళ్ళీ చిరు హోస్ట్‌గా ఎంట్రీ ఇవ్వబోతుండటంతో ఇటు మెగా అభిమానుల్లో అటు సినీ వర్గాలలో రెట్టింపు ఉత్సాహం, ఆసక్తి నెలకొంది. తాజా, సమాచారం మేరకు చిరు ఈ ఎంటర్‌టైన్ ప్రోగ్రామ్ షూట్‌లో పాల్గొంటున్నారు.

Tollywood: మెగాస్టార్ చిరంజీవి మరోసారి హోస్ట్‌గా వ్యవహరించబోతున్నారు. ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ లో ఈ కార్యక్రమం స్ట్రీమింగ్ కోసం రెడీ అవుతోంది. చాలాఏళ్ళ తర్వాత మళ్ళీ చిరు హోస్ట్‌గా ఎంట్రీ ఇవ్వబోతుండటంతో ఇటు మెగా అభిమానుల్లో అటు సినీ వర్గాలలో రెట్టింపు ఉత్సాహం, ఆసక్తి నెలకొంది. తాజా, సమాచారం మేరకు చిరు ఈ ఎంటర్‌టైన్ ప్రోగ్రామ్ షూట్‌లో పాల్గొంటున్నారు.

స్టార్ కమెడియన్‌తో ఫస్ట్ ఎపిసోడ్:

టాలీవుడ్ లెజండరీ కమెడియన్ హాస్యబ్రహ్మ బ్రహ్మానంద, సత్య, సునీల్ లతో మొట్టమొదటి ఎపిసోడ్ షూట్ కూడా పూర్తైనట్టుగా తెలుస్తోంది. బ్రహ్మానందం చంటబ్బాయి సినిమా షూటింగ్ సమయంలో మెగాస్టార్ కంటపడ్డాడు. అప్పటి, ఒక ఫన్నీ ఇన్సిడెంట్ ఇప్పటికీ ఇద్దరూ గుర్తు చేసుకుంటుంటారు. చిరంజీవి సిఫార్సుతో ఎన్నో సినిమాలలో ఆయనతో కలిసి బ్రహ్మీ స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఇక, సునీల్ అయితే..ప్రత్యేకంగా అన్నయ్య సినిమాలో అవకాశం వస్తే చాలనుకున్న రోజులున్నాయి. ఇప్పుడు, సత్య కూడా అంతే. వీరి ముగ్గురుతో చిరు ఫస్ట్ ఎపిసోడ్‌ను ఎంతో సరదాగా పూర్తి చేసినట్టు తెలుస్తోంది.

విశ్వనటుడు కమల్ కూడా:

మెగాస్టార్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ కార్యక్రమానికి విశ్వనటుడు కమల్ హాసన్ వచ్చినట్టుగా తెలుస్తోంది. రెండవ ఎపిసోడ్ కమల్‌తో షూట్ చేసినట్టు తాజాగా ఫిల్మ్ సర్కిల్స్‌లో చెప్పుకుంటున్నారు. ఇద్దరి మధ్య ఎన్నో ఏళ్ళ అనుబంధం ఉంది. ఈ స్పెషల్ ఎపిసోడ్‌లో వీరి జర్నీతో పాటు కమల్ కూతురు శ్రుతి హాసన్ కి సంబందించిన ఆసక్తికరమైన విషయాలను చర్చించనున్నారట. అన్నట్టు, శ్రుతి హాసన్ మెగాస్టార్ నటించిన వాల్తేరు వీరయ్య సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.

15 ఎపిసోడ్..200 కోట్ల రెమ్యునరేషన్:

మెగావర్స్ ఫస్ట్ సీజన్ లో మొత్తం 15 ఎపిసోడ్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది. వీటిలో అప్పటి సీనియర్ హీరోయిన్స్‌తోనూ, బాలీవుడ్ సీనియర్ స్టార్స్‌తోనూ..మన టాలీవుడ్ ఫ్యాన్ డైరెక్టర్స్..మెగా బ్రదర్స్ లతో స్పెషల్ ఎపిసోడ్స్ ప్లాన్ చేస్తున్నారట. ఇక, ఈ 15 ఎపిసోడ్స్‌కి గానూ చిరుకు అందే రెమ్యునరేషన్ 200 కోట్లని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే, కింగ్ నాగార్జున బిగ్ బాస్ రియాలిటీ షోను 3వ సీజన్ నుంచి నడిపిస్తున్నాడు. బాలయ్య, ఆహాలో అన్‌స్టాపబుల్ సీజన్స్‌ను విజయవంతగా నడుపుతున్నాడు. జగ్గుభాయ్ కూడా జీలో జయమ్ము నిశ్చయంబురా కార్యక్రమానికి హోస్ట్‌గా వ్యవహరిస్తున్నాడు.

#Megaverse#Megastar Chiranjeevi#Brahmanandam#Sunil#Sathya#Kamal Haasan
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి