ఏపీ

AP: అర్నబ్ తుఫాన్ బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటాం: సీఎం చంద్రబాబు

రచన: Mahesh••4 నిమిషాల పఠనం

AP: అర్నబ్ తుఫాన్ వల్ల నష్టపోయిన వాళ్లెవరూ కంగారు పడాల్సిన అవసరం లేదని, బాధితులందరినీ అన్ని రకాలుగా ప్రభుత్వం ఆదుకుంటుందని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. సచివాలయంలోని ఆర్టీజీఎస్ సెంటర్ నుంచి పరిస్థితులను సమీక్షించిన సీఎం, అనంతరం మీడియాతో మాట్లాడారు.

AP: అర్నబ్ తుఫాన్ వల్ల నష్టపోయిన వాళ్లెవరూ కంగారు పడాల్సిన అవసరం లేదని, బాధితులందరినీ అన్ని రకాలుగా ప్రభుత్వం ఆదుకుంటుందని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. సచివాలయంలోని ఆర్టీజీఎస్ సెంటర్ నుంచి పరిస్థితులను సమీక్షించిన సీఎం, అనంతరం మీడియాతో మాట్లాడారు. పంటలు, ఆస్తులు కోల్పోయి ఇబ్బందుల్లో ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం అండగా నిలబడుతుందని, ఎవరికీ అన్యాయం జరగకుండా చూస్తామని భరోసా ఇచ్చారు.

నష్టపోయిన కుటుంబాలకు ఆర్థిక సాయం..

తుఫాన్ దెబ్బకు ఐదుగురు చనిపోవడంపై సీఎం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చనిపోయిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున సాయం అందజేస్తామని చెప్పారు. ఇళ్లు పాడైపోయిన వాళ్లకు తక్షణ ఖర్చుల కోసం రూ.10 వేలు, పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్న వాళ్లకు ఒక్కొక్కరికి రూ.వెయ్యి చొప్పున గరిష్టంగా రూ.3 వేల వరకు సాయం అందించి ఆదుకుంటామని తెలిపారు.

చిన్న వ్యాపారులు, మత్స్యకారులకూ అండగా..

సాధారణ ప్రజలతో పాటు ఉపాధి కోల్పోయిన వ్యాపారులు, జాలర్లకు కూడా ప్రభుత్వం సాయం ప్రకటించింది. కిరాణా కొట్లు, హోటళ్లు దెబ్బతింటే రూ.25 వేల సాయం, ఎంఎస్‌ఎంఈల టర్నోవర్‌ను బట్టి రూ.50 వేల నుంచి రూ.1.5 లక్షల వరకు పరిహారం, పాడైన బోట్లకు రూ.9 వేలు, వలలు బాగు చేసుకోవడానికి రూ.5 వేలు, వలలతో పాటు బోట్లు పూర్తిగా పాడైతే రూ.25 వేల ఆర్థిక సాయం, దెబ్బతిన్న బైక్‌లకు రూ.3 వేలు, ఆటోలకు రూ.10 వేలు అందిస్తామన్నారు.

కరెంట్ పునరుద్ధరణ.. ఆ జిల్లాల వాళ్లు జాగ్రత్త

గత మూడు రోజులుగా అధికారులను అప్రమత్తం చేస్తూ ప్రజల ప్రాణాలను కాపాడేందుకు వరుస చర్యలు తీసుకున్నామని సీఎం తెలిపారు. నిన్న రాత్రి 11:15 గంటలకు తుఫాన్ తీరం దాటి పక్క రాష్ట్రాలకు వెళ్లిపోయినప్పటికీ, కొన్ని జిల్లాల్లో వర్షాలు కొనసాగుతున్నాయని చెప్పారు. కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాల్లో వర్షాల వల్ల పనులు కాస్త ఆలస్యమవుతున్నాయని, ఆ రెండు జిల్లాలు తప్ప మిగతా అన్ని చోట్లా సాయంత్రానికల్లా కరెంట్ సరఫరాను తిరిగి ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. శ్రీకాకుళం, అల్లూరి, మన్యం, అనకాపల్లి జిల్లాల ప్రజలు గురువారం సాయంత్రం దాకా చాలా జాగ్రత్తగా ఉండాలని సీఎం సూచించారు.

#Andhra Pradesh#AP News#Andhra Pradesh News#Andhra Pradesh Cyclone#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి