మనుషులు ఏదైనా తిక్క పనులు చేస్తే ఏంటీ ఈ ‘కోతి చేష్టలు’ అని తిట్టడం సహజం. అయితే ఒక కోతి చేసిన పని చూసిన వారంతా ఏంటీ ఈ ‘మనిషి చేష్టలు’ అనేలా చేసింది. ఎప్పుడూ పండ్లు తినీ తినీ బోర్ కొడుతోందనుకుందో ఏమో ఓ వైన్స్‌పై కన్నేసింది. దుకాణంలో ఉన్న వాళ్లంతా "ఏం కావాలి భయ్యా?" అని అడిగేలోపే... కౌంటర్‌పై ఉన్న ఒక క్వార్టర్ సీసాను స్టైల్‌గా చేతిలోకి తీసుకుంది. ఇక అసలు సిసలైన టాలెంట్ అప్పుడే బయటపడింది. ఏమాత్రం తడబడకుండా, మూతను తన పళ్లతో ‘పప్’మని ఓపెన్ చేసి, డైరెక్ట్‌గా గటగటా తాగేసింది. సీసా ఖాళీ చేసే స్పీడ్ చూసి అక్కడున్న మందుబాబులంతా నోరెళ్లబెట్టారు.
జార్ఖండ్ రాజధాని రాంచీలో చోటుచేసుకున్న ఈ విచిత్రమైన ఘటనా దృశ్యం ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. సాధారణంగా ఆహార పదార్థాలు లేదా పండ్ల కోసం షాపులపై పడే కోతులు, ఈసారి ఏకంగా ఒక మద్యం దుకాణంలోకి ప్రవేశించి హల్‌చల్ చేసింది. అక్కడ కౌంటర్‌పై ఉన్న ఒక మద్యం సీసాను తన చేతుల్లోకి తీసుకున్న ఆ కోతి బావ, ఎంతో చాకచక్యంగా దాని మూతను పళ్లతో తీసి నేరుగా మద్యం సేవించడం ప్రారంభించింది.
దుకాణంలో ఉన్న సిబ్బంది, కొనుగోలుదారులు ఈ వింత చర్యను చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. అయితే సీన్ అక్కడితో అయిపోలేదు. కిక్కు తలకెక్కడంతో మన కోతి బావ గారు అసలు రంగు బయటపెట్టారు. కాసేపు మైకంలో ఊగుతూ, తూలుతూ రాంచీ వీధుల్లో ఫుల్ నైట్ పార్టీ చేసుకున్నట్లు మైకంలో తూలుతూ కిందపడిపోయింది. మద్యం మత్తు ఎక్కువ కావడంతో కాసేపటికే అది అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయినట్లు అక్కడి స్థానికులు తెలిపారు. ఈ దృశ్యాన్ని తమ ఫోన్లలో చిత్రీకరించిన స్థానికులు, కొనుగోలుదారులు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేయడంతో ఆ వీడియో నిమిషాల్లోనే నెట్టింట హల్‌చల్ చేసింది.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ‘మా కంటే వేగంగా మూత తీసి తాగేస్తోందిరా బాబోయ్’ వైన్ షాప్ నిర్వాహకులు మాత్రం ‘అబ్బా... వీళ్లకు తోడు ఇప్పుడు కోతులకు కూడా పర్మిట్ కార్డులు ఇవ్వాల్సి వస్తుందేమో’ అని తలలు పట్టుకుంటున్నారు. ఏదేమైనా, కాసేపటికి కిక్కు దిగాక ఆ కోతిరాజా ఏమీ తెలియనట్లు సాఫీగా జారుకుందట. మందుబాబులూ జాగ్రత్త... రేపు వైన్ షాప్ క్యూ లైన్లలో మీ పక్కన కోతి నిలబడినా ఆశ్చర్యపోనవసరం లేదు.










