సినిమా

The Paradise: ఫ్లాప్ టాక్‌తోను 100 కోట్లు దాటిన నాని

రచన: Anshu•••4 నిమిషాల పఠనం

The Paradise: నాని మాస్ జాతర బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో కొనసాగుతుందనడానికి తాజా చిత్రం ది ప్యారడైజ్ అతిపెద్ద ఉదాహరణ. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నానీ హీరోగా, కయాదు లోహర్ హీరోయిన్‌గా నటించిన లేటెస్ట్ మాస్ అండ్ యాక్షన్ సినిమా ది ప్యారడైజ్. ఈ సినిమాకి ప్రీమియర్స్ నుంచే డివైడ్ టాక్ వచ్చింది. కానీ, ఈ టాక్‌తో సంబంధం లేకుండానే ఇప్పుడు ఈ సినిమా 100 కోట్ల మార్క్‌ను దాటేసింది.

ఒక్కరోజులోనే 26 కోట్ల షేర్ వచ్చినట్టుగా తెలుస్తోంది. ఒక ఫ్లాప్ సినిమాకు ఈ రేంజ్‌లో వసూళ్ళు వస్తున్నాయంటే కేవలం నాని పర్ఫార్మెన్స్ మీదే ఇంతగా వసూళ్ళు వస్తున్నాయని ప్రత్యేకించి చెప్పాలి. సోషల్ మీడియాలో ఎంత ట్రోల్ చేసినా, ఎంత నెగిటివిటీ క్రియేట్ చేసినా కూడా సినిమా చూడాలనే ఉత్సాహం ఉంటే..బాక్సాఫీస్ వద్ద లెక్కలు ఇలాగే ఉంటాయని మళ్ళీ నాని నిరూపించాడు.

ఒకరకంగా ఇది, యష్ నటించిన టాక్సిక్ సినిమా కంటే కూడా కంప్లీట్ పాజిటివ్ వైబ్ అని చెప్పాలి. జస్ట్ 2 రోజుల్లోనే ఇలా 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ని దాటిన జడల్..ఇంకా వీకెండ్ కాబట్టి..మరో రెండు రోజులు ఇదే ఊపు కనిపిస్తుందని భావించవచ్చు. చూడాలి, మరి నానీ పడ్డ కష్టానికి సరైన ప్రతి ఫలం దక్కుతుందో లేదో. ఏదేమైనా నాని..దర్శకుడు శ్రీకాంత్ ఓదెల చేసిన ఈ సాహసం మెచ్చుకొని తీరాల్సిందే.

సరైన ప్రమోషన్స్ లేవు. థియేట్రికల్ ట్రైలర్ కట్ లేదు. హీరోయిన్ పెద్దగా సినిమాను ప్రమోట్ చేయలేదు. అసలు..ప్రమోషన్స్‌కి సమయమే దొరకలేదు. ఇంత ఠఫ్ సిచ్యువేషన్స్ మధ్య శ్రీకాంత్ ఓదెల సినిమాను చెప్పిన తేదీకి తీసుకొచ్చాడు. మొత్తానికి, భారీ డిజాస్టర్ అని మాట్లాడిన వాళ్ళకి 100 కోట్ల మార్క్ దాటడం కాస్త మింగుడుపడని విషయం. చూడాలి, మరి లాంగ్ రన్ లో ది ప్యారడైజ్ ఏ స్థాయి హిట్‌గా నిలుస్తుందో.

#nani#the paradise#srikanth odela#kayadu lohar
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి