SS.Rajamouli: గ్లోబల్ స్థాయిలో మార్కెట్‌ను విస్తరించుకునేందుకు ఇప్పటికే మన మేకర్స్ ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్నీ చేస్తున్నారు. అక్కడ మార్కెట్‌ను బాగా ఆకట్టుకునేందుకు భారతీయ చిత్ర పరిశ్రమ పాన్ ఇండియన్ సినిమాలతో ఎప్పటికప్పుడు కొత్త వ్యూహాలను ఎంచుకుంటోంది. ఇటీవల కన్నడ రాకింగ్ స్టార్ యష్ ‘టాక్సిక్’ సినిమాను నేరుగా ఇంగ్లీష్‌లో కూడా షూట్ చేసి విదేశీ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. అయితే, రాజమౌళి ఇంకో ప్రయత్నం చేయబోతున్నాడు. తెలుగులోనే అన్నీ చోట్లా రిలీజ్ చేయనున్నాడట.
యష్ చేసిన ప్రయత్న వృధా అయినట్టే అనుకోవాలి. స్ట్రైట్‌గా ఇంగ్లీష్ వర్షన్ రిలీజ్ చేసినప్పటికీ, అది బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందులేకపోయింది. మరోవైపు, రణ్‌బీర్ కపూర్ ‘రామాయణ’ సినిమాను ఎ ఐ లిప్-సింక్ టెక్నాలజీతో నటీనటుల సహజమైన, పర్ఫార్మెన్స్ అండ్ ఎమోషన్స్ దెబ్బతినకుండా ఇంగ్లీష్ లోకి డబ్ చేసే సరికొత్త మార్గాన్ని ఎంచుకుంది.
అయితే, మన దర్శకధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి మాత్రం మహేష్ బాబుతో చేస్తున్న పాన్ వరల్డ్ సినిమా ‘వారాణాసి’ సినిమా కోసం పూర్తిగా భిన్నమైన శైలిని ఉపయోగించబోతున్నారు. ముందుగా వారణాసి సినిమాను తెలుగులోనే విడుదల చేస్తూ, విదేశాల్లో ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో ప్రదర్శించబోతున్నారట. బలమైన కథ, దృశ్యకావ్యం ఉంటే భాషతో సంబంధం లేకుండా ప్రపంచ దేశాలలోని సినీ లవర్, ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని బలంగా నమ్మే రాజమౌళి, నిజమైన విజన్ ఉన్న లెజెండరీ డైరెక్టర్ అని మరోసారి నిరూపించుకోబోతున్నాడు.
ఇక, ఈ క్రేజీ ప్రాజెక్ట్ 2027, ఏప్రిల్ 7న విడుదల కానుంది. 120 దేశాలు..దాదాపు 50 భాషల్లో వారణాసి మూవీ రిలీజ్ అనేది అతిపెద్ద టాస్క్. ఇలాంటి, హై లెవల్ రిస్క్ ఇప్పటి వరకూ ఎవరూ చేయలేదు. ఇక, సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న మొదటి పాన్ వరల్డ్ సినిమా కావడం కూడా విశేషం. గ్లోబల్ బ్యీటీ ప్రియాంక చోప్రా మందాకినిగా అలరించబోతోంది. మలయాళ నటుడు పృథ్విరాజ్ సుకుమారన్ కుంభ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.










