తెలంగాణ

TG : ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థినులకు వేధింపులు.. పీఈటీ ఎస్కేప్!

రచన: Kumar••4 నిమిషాల పఠనం

విద్యాబుద్ధులు నేర్పి విద్యార్థులకు మంచి భవిష్యత్ ప్రసాదించాల్సిన గురువులు గాడి తప్పుతున్నారు. విద్యార్థినులు కూడా తమ పిల్లలే అనుకోవాల్సిన వారు తమలోని క్రూరత్వాన్ని, వికృత రూపాన్ని ప్రదర్శిస్తున్నారు. దీంతో బాలికలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

విద్యాబుద్ధులు నేర్పి విద్యార్థులకు మంచి భవిష్యత్ ప్రసాదించాల్సిన గురువులు గాడి తప్పుతున్నారు. విద్యార్థినులు కూడా తమ పిల్లలే అనుకోవాల్సిన వారు తమలోని క్రూరత్వాన్ని, వికృత రూపాన్ని ప్రదర్శిస్తున్నారు. దీంతో బాలికలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బయటకు చెప్పుకోలేక నరకయాతన అనుభవిస్తున్నట్టు సమాచారం. కొందరు ధైర్యం చేసి ఇంట్లో ఈ విషయాన్ని చెప్పగా..స్కూల్స్‌లో విద్యార్థినుల పట్ల జరుగుతున్న దారుణాలు నెమ్మదిగా వెలుగుచూస్తున్నాయి.

మరికొందరు విద్యార్థినులు ధైర్యం చేయకపోవడం వలన సమస్య మరింత జఠిలం అవుతుంది తప్పా పరిష్కారం దొరకదని వారికి అర్థం అయ్యేలోపు అనర్థాలు జరిగిపోతున్నాయి. తాజాగా ఖమ్మం జిల్లా గుదిమళ్ల ప్రభుత్వ పాఠశాలలో ఓ పీఈటీ టీచర్ విద్యార్థినులను గత కొంతకాలంగా వేధింపులకు గురిచేస్తున్నట్టు తెలిసింది. ఫిజికల్ ట్రైనింగ్ పేరుతో బాలికలను అసభ్యంగా తాకుతూ ఇబ్బందులకు గురిచేసినట్టు సమాచారం.

అయితే, వేధింపులు తీవ్రతరం కావడంతో పీఈటీ షఫీ అహ్మద్‌పై విద్యార్థినులు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం బయటకు వెలుగుచూసింది. ఉపాధ్యాయుడు తమ పట్ల అసభ్యంగా ప్రవర్తించారంటూ విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. విషయం తెలుసుకుని పాఠశాలకు చేరుకున్న విద్యార్థినుల తల్లిదండ్రులు హెచ్‌ఎంను నిలదీశారు. సదరు ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

అయితే, విద్యార్థినుల ఫిర్యాదుల నేపథ్యంలో వేధింపులకు పాల్పడిన పీఈటీ గత రెండు రోజులుగా అందుబాటులో లేకుండా పోయారు. అతను సెలవులో ఉన్నాడని హెడ్ మాస్టర్ పేరెంట్స్‌కు వివరించారు. బాధ్యుడిపై వెంటనే చర్యలు తీసుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని బాధిత విద్యార్థినుల తల్లిదండ్రులు హెచ్చరించినట్టు సమాచారం. పాఠశాల వద్ద ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. తల్లిదండ్రులతో మాట్లాడి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. కాగా, ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని హెచ్‌ఎం పేరెంట్స్‌కు వివరించినట్టు సమాచారం.

#PET#teacher#sexual harrasment#students#kammam#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి