తెలంగాణ

TGTET: టీజీటెట్‌ ఫలితాలు విడుదల.. 70.07 శాతం ఉత్తీర్ణత!

రచన: Mamatha puppala••4 నిమిషాల పఠనం

రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్, స్థానిక సంస్థల పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న ఇన్‌-సర్వీస్ ఉపాధ్యాయుల కోసం నిర్వహించిన టీజీటెట్‌ (TGTET-Inservice Teachers 2026) పరీక్షా ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. విద్యాశాఖ డైరెక్టర్, టీజీటెట్ ఛైర్‌పర్సన్ ఈ ఫలితాలను అధికారికంగా వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఈ కంప్యూటర్ ఆధారిత పరీక్షల్లో మొత్తం 70.07 శాతం మంది ఉపాధ్యాయులు అర్హత సాధించి ఉత్తీర్ణత సాధించారు.

 ఈ పరీక్షల కోసం జులై 21న నోటిఫికేషన్ విడుదల కాగా, సెప్టెంబర్ 8, 9 తేదీల్లో మూడు విడతల్లో ఆన్‌లైన్ సీబీటీ పద్ధతిలో పరీక్షలను నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 24,986 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, అందులో 22,477 మంది ఉపాధ్యాయులు పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 15,749 మంది ఉపాధ్యాయులు ఉత్తీర్ణత సాధించి అర్హత పొందినట్లు విద్యాశాఖ అధికారులు స్పష్టం చేశారు.

 విభాగాల వారీగా ఫలితాలను పరిశీలిస్తే, ప్రాథమిక పాఠశాల బోధనకు సంబంధించిన పేపర్-1 పరీక్షకు 4,942 మంది హాజరుకాగా, అందులో 3,398 మంది 68.76శాతం అర్హత సాధించారు. ఇక పేపర్-2 గణితం, సైన్స్ విభాగంలో 9,131 మంది పరీక్ష రాయగా, అత్యధికంగా 6,720 మంది 73.60 శాతం ఉత్తీర్ణులయ్యారు. అలాగే పేపర్-2 సోషల్ స్టడీస్ విభాగంలో 8,404 మంది ఉపాధ్యాయులు హాజరుకాగా, వారిలో 5,631 మంది 67.00 శాతం అర్హత సాధించారు.

 పరీక్షకు హాజరైన ఇన్‌-సర్వీస్ ఉపాధ్యాయులు తమ ఫలితాలను, సబ్జెక్టుల వారీ మార్కుల వివరాలను పాఠశాల విద్యాశాఖ అధికారిక వెబ్‌సైట్ schooledu.telangana.gov.in లేదా tgtet.cgg.gov.in నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని అధికారులు సూచించారు. అభ్యర్థులు తమ హాల్ టికెట్ వివరాల ద్వారా మార్కుల మెమోలను పొందవచ్చని, లేదా సమీపంలోని మీ-సేవ కేంద్రాల ద్వారా కూడా తమ ఫలితాల ప్రతులను ప్రింట్ తీసుకోవచ్చని వెల్లడించారు.

#TGTET2026#TelanganaTeacherEligibilityTest#InServiceTETResults#TelanganaEducation#SchoolEducationTelangana#TGTETInServiceResults#TGNews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి