తెలంగాణ

Hyd : పోలీసులు vs ఉద్యోగులు.. రోడ్ బ్లాక్‌తో వాహనదారుల పరేషాన్

రచన: Kumar••4 నిమిషాల పఠనం

హైదరాబాద్ మహానగరంలో గణనాథుల నిమజ్జనాలు ఇంకా కొనసాగుతున్నాయి. శుక్రవారం మధ్యాహ్నం 2.25 గంటల ప్రాంతంలో ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం ప్రశాంతంగా ముగిసిన విషయం తెలిసిందే. నగరం నలుమూలల నుంచి వేలాదిగా వచ్చిన భక్తులు నిన్న మహాగణపతిని దర్శించుకుని కడసారి వీడ్కోలు పలికారు.

హైదరాబాద్ మహానగరంలో గణనాథుల నిమజ్జనాలు ఇంకా కొనసాగుతున్నాయి. శుక్రవారం మధ్యాహ్నం 2.25 గంటల ప్రాంతంలో ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం ప్రశాంతంగా ముగిసిన విషయం తెలిసిందే. నగరం నలుమూలల నుంచి వేలాదిగా వచ్చిన భక్తులు నిన్న మహాగణపతిని దర్శించుకుని కడసారి వీడ్కోలు పలికారు. అయితే, సిటీలోని వివిధ ప్రాంతాల నుంచి నిన్న రాత్రి వరకు వచ్చిన విగ్రహాలను ఇవాళ ఉదయం నుంచి ట్యాంక్ బండ్ వద్ద నిమజ్జనం ప్రక్రియ కొనసాగుతోంది.

నేటి సాయంత్రం వరకు మొత్తం నిమజ్జనం ప్రక్రియ పూర్తికానుందని సమాచారం. భారీ వినాయకులు హుస్సేన్ సాగర్ వద్ద నిమజ్జనం కోసం బారులు తీరినట్టు తెలుస్తోంది. నిమజ్జనం ప్రక్రియ మొత్తం పూర్తికాకపోవడంతో నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు ఇంకా కొనసాగుతున్నాయి. దీంతో ఇవాళ ఉదయం నుంచి ఆఫీసులు, వివిధ పనుల కోసం రోడ్ల మీదకు వచ్చిన వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నిమజ్జనం పూర్తయ్యిందని రెగ్యులర్‌గా వెళ్లే దారిలో వచ్చిన వారికి పోలీసులు షాక్ ఇచ్చారు.

ఎక్కడికక్కడ భారీ కేడ్లను అలాగే ఉంచారు. తొలగించకపోవడంతో అక్కడే విధుల్లో ఉన్న పోలీసులు, వాహనదారులకు మధ్య వాగ్వాదం నెలకొంది. నగరంలో వివిధ చోట్లకు వెళ్లే ప్రధాన రహదారి అయిన లక్డీకాపూల్ వద్ద భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ట్యాంక్ బండ్ వద్ద నిమజ్జనాలు కొనసాగుతుండటంతో చుట్లూ రోడ్లను పోలీసులు బ్లాక్ చేసి ఉంచారు.

అయితే, ప్రత్యామ్నాయ రూట్ మ్యాప్స్ ఇవ్వకుండా రోడ్లు బ్లాక్ చేయడం ఏంటని వాహనదారులు నిలదీస్తున్నారు.ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోవడంతో పబ్లిక్ ట్రాన్స్ పోర్టును నమ్ముకున్న ప్రయాణికులు సైతం ఇబ్బందులు పడాల్సి వచ్చినట్టు తెలిసింది.టెలిఫోన్‌ భవన్‌, స్కూల్‌ ఎడ్యుకేషన్‌ ఆఫీస్‌, సెక్రెటేరియట్‌కు వెళ్లే ఉద్యోగులకు తిప్పలు తప్పలేదు. ఐడీ కార్డులు చూపించినా ఉద్యోగులను అనుమతించకపోవడం వల్ల పోలీసులతో వాగ్వాదం నెలకొంది. ట్రాఫిక్‌ ఆంక్షలతో కారణంగా ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆఫీసులకు ఆలస్యం అవుతోందని సహనం కోల్పోయిన వారంతా పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

#traffic#hyderabad#immersion#kairatabad#employees#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి