తెలంగాణ

BRS : కొండా లక్ష్మణ్ బాపూజీ స్ఫూర్తితో నిరంతరం పోరాడాలి : హరీశ్ రావు

రచన: Kumar••4 నిమిషాల పఠనం

స్వాతంత్ర్య సమరయోధుడు, తెలంగాణ ఉద్యమకారుడు, అణగారిన వర్గాల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన మహనీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్ రావు సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా ఆసక్తికర పోస్టు పెట్టారు.

స్వాతంత్ర్య సమరయోధుడు, తెలంగాణ ఉద్యమకారుడు, అణగారిన వర్గాల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన మహనీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్ రావు సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా ఆసక్తికర పోస్టు పెట్టారు. స్వాతంత్ర్య పోరాటం నుంచి తెలంగాణ సాధన వరకు ఆయన చేసిన త్యాగం, పోరాటం చిరస్మరణీయమని కొనియాడారు.

కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు, స్ఫూర్తి భవిష్యత్ తరాలకు అందాలనే ఉద్దేశంతో వారి జయంతిని అధికారికంగా నిర్వహించాలని తెలంగాణ రాష్ట్రం తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారని గుర్తుచేశారు. ఉద్యాన విశ్వవిద్యాలయానికి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టడంతో పాటు, ట్యాంక్ బండ్ పై వారి విగ్రహాన్ని ఏర్పాటు చేసి సమున్నతంగా గౌరవించారని తెలిపారు.కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే ఆయనకు మనమిచ్చే నిజమైన నివాళి అని పేర్కొన్నారు.

ఆ మహనీయుని స్ఫూర్తితో ప్రజల హక్కుల కోసం, తెలంగాణ ఆత్మగౌరవం కోసం నిరంతరం పోరాడుదామని పిలుపునిచ్చారు.ఇదిలాఉండగా, కొండాలక్ష్మణ్ బాపూజీ తెలంగాణ తొలి దశ, మలిదశ ఉద్యమానికి నాంది పలికిన పోరాటాల్లో కీలక పాత్ర పోషించారు. 1952లో నాన్‌-ముల్కీ/ముల్కీ ఉద్యమంలో బాపూజీ పాల్గొన్నారు. స్థానికులకు ఉద్యోగాలు, అవకాశాల్లో ప్రాధాన్యం ఉండాలనే అంశంపై తెలంగాణ ప్రాంత ప్రయోజనాల కోసం ఆయన పోరాడారు.

1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఉద్ధృతమైనప్పుడు బాపూజీ అప్పటి కాసు బ్రహ్మానందరెడ్డి కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. తెలంగాణ డిమాండ్‌కు మద్దతుగా మంత్రి పదవికి రాజీనామా చేసిన తొలి మంత్రిగా ఆయన చరిత్రలో నిలిచారు. అనంతరం ఉద్యమానికి మరింత బలం చేకూర్చేలా సభలు, సమావేశాలు, రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 1969 ఉద్యమ సమయంలో తెలంగాణ కాంగ్రెస్ సమితి ఏర్పాటులో ఆయన కీలకంగా వ్యవహరించారు. 1990ల నుంచి తిరిగి ఊపందుకున్న ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలోనూ బాపూజీ తన వంతు పాత్ర పోషించారు. 2000లలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పనిచేసిన నాయకులకు, సంస్థలకు ఆయన మద్దతుగా నిలిచారు. ఆయన జలదృశ్యం నివాసం తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన రాజకీయ చర్చలు, సమావేశాలకు కూడా వేదికగా నిలిచింది.

#harish rao#konda laxman bapooji jayanthi#politics#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి