సినిమా

Srikanth Odela: ది ప్యారడైజ్ ఫ్లాప్ .. శ్రీకాంత్ ఓదెలకు మెగా ఛాన్స్ మిస్ అవుతుందా?

రచన: Anshu•••4 నిమిషాల పఠనం

Srikanth Odela: యంగ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల పేరు టాలీవుడ్‌లో ఒక్క సినిమాతోనే మార్మోగింది. మొదటి చిత్రం ‘దసరా’తో తనలోని మాస్ టేకింగ్‌ను చూపించిన శ్రీకాంత్.. ఇప్పుడు నాని హీరోగా తెరకెక్కిన ‘ది ప్యారడైజ్’తో మరోసారి భారీ అంచనాలను సెట్ చేశాడు. అయితే, ఈ సినిమా ఫలితం శ్రీకాంత్ కెరీర్‌లో చాలా కీలకంగా మారనుందన్న విషయం అందరికీ తెలిసిందే. దసరా సినిమా చూసే మెగాస్టార్ చిరంజీవి..ఈ యువ దర్శడుకి ఛాన్స్ ఇచ్చారు. కానీ, ప్యారడైజ్ ఫలితం వల్ల అది మిస్ అవుతుందంటున్నారు.

‘దసరా’ లాంటి భారీ విజయంతో శ్రీకాంత్ ఓదెలకు టాలీవుడ్‌లో మంచి గుర్తింపు వచ్చింది. రా అండ్ రస్టిక్ కథను తనదైన శైలిలో తెరకెక్కించిన విధానం ప్రేక్షకులను ఆకట్టుకుంది. దీంతో రెండో సినిమాకే భారీ స్థాయిలో సినిమా చేసే అవకాశం దక్కింది. అది కూడా నానితో మరోసారి సినిమా చేయడం కూడా ఇండస్ట్రీ వర్గాలలో అంచనాలను పెంచేసింది.

ఈ నేపథ్యంలోనే నాని, శ్రీకాంత్ కలిసి చేసిన ‘ది ప్యారడైజ్’ విషయంలో కూడా అంచనాలు పాన్ ఇండియా వైడ్‌గా పెరిగాయి. నాని వంటి స్టార్ హీరోతో భారీ బడ్జెట్‌లో తెరకెక్కిన ఈ సినిమా శ్రీకాంత్ ఓదెలను నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లే ప్రాజెక్ట్‌గా భావించారు. ప్రమోషనల్ కంటెంట్ తో పెరిగిన హైప్ ఇద్దంతా. హీరోయిన్‌గా కయాదు లోహర్ నటించగా, స్పెషల్ నంబర్ లో కీర్తి సురేష్..కీలక పాత్రల్లో మోహన్ బబౌ, సంపూర్ణేష్ బాబు నటించారు.

అయితే భారీ అంచనాలున్న సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఫలితాన్ని అందుకోలేదు. దాని ప్రభావం దర్శకుడి తదుపరి సినిమాపై పడే అవకాశం ఉంటుంది. శ్రీకాంత్ ఓదెల విషయంలోనూ ఇదే ప్రశ్న ఎదురవుతోంది. ‘ది ప్యారడైజ్’ ఆశించిన స్థాయిలో ఆడకపోతే.. ఆయనతో సినిమా చేయాలని భావిస్తున్న మెగాస్టార్ నెక్ట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు..అనేది ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. విపరీతమైన ట్రోలింగ్ రీకాంత్ గురించే జరుగుతోంది. ఇలాంటి, పరిస్థితుల్లో మెగా ఛాన్స్ కూడా మిస్ అవుతుందనే అంటున్నారు.

#Srikanth Odela#Chiranjeevi#Nani#The Paradise
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి