ప్రపంచం

Flight: విమానం క్రాష్.. ఇద్దరు ఆర్మీ అధికారులు సహా 14 మంది దుర్మరణం

రచన: Kumar••4 నిమిషాల పఠనం

ఆఫ్రికా ఖండంలో మరో ఘోరప్రమాదం చోటుచేసుకుంది. కాంగో దేశంలో నిన్న ఘోర విమాన ప్రమాదం సంభవించింది. కిక్విట్ నుండి కాంగో రాజధాని కిన్షాసాకు వెళుతున్న విమానం కెంగే ప్రాంతంలో క్రాష్ ల్యాండ్ అయింది.ఈ ఘటనలో విమానంలోని ప్రయాణికులు మరణించారు.

ఆఫ్రికా ఖండంలో మరో ఘోరప్రమాదం చోటుచేసుకుంది. కాంగో దేశంలో నిన్న ఘోర విమాన ప్రమాదం సంభవించింది. కిక్విట్ నుండి కాంగో రాజధాని కిన్షాసాకు వెళుతున్న విమానం కెంగే ప్రాంతంలో క్రాష్ ల్యాండ్ అయింది.ఈ ఘటనలో విమానంలోని ప్రయాణికులు మరణించారు.ప్రాణాలు కోల్పోయిన వారిలో ఇద్దరు మిలిటరీ అధికారులు సైతం ఉన్నట్టు సమాచారం. వారిలో ఒకరు లెఫ్టినెంట్ జనరల్ ముటొంబో కటలాయి టియెండే, మరొకరు సాయుధ దళాల ఆడిటర్ జనరల్ బకుమి లికులియా అని తెలుస్తోంది.

అయితే, ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని అధికారులు వెల్లడించినట్టు సమాచారం. ఇదిలాఉండగా, కాంగో దేశంలో గత కొంతకాలంగా భద్రతా పరిణామాలు చాలా ఉద్రిక్తంగా మారాయి. ఆ దేశ తూర్పు ప్రాంతంలో తిరుగుబాటు గ్రూపులతో సైన్యం పోరాడుతుండగా.. గతేడాది ఈ గ్రూపులు పలు నగరాలను స్వాధీనం చేసుకున్నాయి. సైన్యం తిరుగుబాటు సమూహాలతో పోరాడుతున్న సమయంలో మిలిటరీ అధికారులు ప్రయాణిస్తున్న విమానం ప్రమాదానికి గురవ్వడం పలు అనుమానాలకు దారితీస్తోంది.

ఈ ప్రమాదం వెనుక తిరుగుబాటు దారుల హస్తం ఏమైనా ఉందా? అన్నకోణంలో విచారణ జరుపుతున్నట్టు కాంగో మిలిటరీ అధికారులు తెలిపినట్టు సమాచారం. ఇదిలాఉండగా, 2026లో ఘోర విమానప్రమాదాలు చోటుచేసుకున్నాయి. మార్చి 23న కొలంబియాలో సైనిక C-130 హెర్క్యులస్ విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలగా.. ఆ సమయంలో 126 మంది ఉండగా, 70 మంది మృతి చెందారు.

ఫిబ్రవరి 27న బొలీవియాలో వైమానిక దళానికి చెందిన C-130 విమానం ఎల్ ఆల్టో విమానాశ్రయంలో ల్యాండింగ్ సమయంలో రన్‌వే దాటి రోడ్డుపైకి దూసుకెళ్లగా..పలు వాహనాలను ఢీకొన్న ఈ ప్రమాదంలో 24 మంది మృతిచెందారు.ఏప్రిల్ 27న జుబా సమీపంలో Cessna విమానం కుప్పకూలగా.. 13 మంది ప్రయాణికులు, ఒక పైలట్ కలిపి మొత్తం 14 మంది మృతి చెందారు.జనవరి 28న భారత్‌లో బారామతి Learjet ప్రమాదంలో 5 మంది ప్రాణాలు కోల్పోయారు. జనవరి 17న ఇండోనేషియాలో ATR 42-500 విమానం అదృశ్యమై పర్వత ప్రాంతంలో కూలిపోగా.. 10 మంది మృతి చెందారు.

#Flight crash#14 members#died#cango#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి