వైరల్ న్యూస్

viral : డబ్బు కట్టలతో షో .. అతి చేసి అనుభవించిన యూట్యూబర్ ఫ్యామిలీ!

రచన: Kumar••4 నిమిషాల పఠనం

కొందరు వ్యక్తులు సోషల్ మీడియానే తమ ప్రపంచంగా భావించి ఇంట్లోని సంసారాన్ని బజార్లో పెడుతున్నారు. వ్యూస్,లైక్స్ కోసం దిగజారి ప్రవర్తిస్తున్నారు. తమ ఇంట్లో ఉదయాన్నే ఏం చేస్తుంటాం, మధ్యాహ్నం ఏం చేస్తుంటాం. సాయంకాలం,రాత్రి ఇలా ప్రతి అప్డేట్ సోషల్ మీడియాలో పోస్టు చేయడం కొందరికి వ్యసనంలా మారింది.

కొందరు వ్యక్తులు సోషల్ మీడియానే తమ ప్రపంచంగా భావించి ఇంట్లోని సంసారాన్ని బజార్లో పెడుతున్నారు. వ్యూస్,లైక్స్ కోసం దిగజారి ప్రవర్తిస్తున్నారు. తమ ఇంట్లో ఉదయాన్నే ఏం చేస్తుంటాం, మధ్యాహ్నం ఏం చేస్తుంటాం. సాయంకాలం,రాత్రి ఇలా ప్రతి అప్డేట్ సోషల్ మీడియాలో పోస్టు చేయడం కొందరికి వ్యసనంలా మారింది. ఫలితంగా మన వ్యక్తిగత డిటేల్స్, ఇంట్లో ఎంతమంది ఉంటున్నారు? వస్తువులు ఏం ఉన్నాయ్.. ఇలా ప్రతి ఇన్ఫర్మేషన్ క్రిమినల్స్, దొంగలు, సైబర్ నేరగాళ్లకు వెళ్లిపోతుందని గుర్తించడం లేదు. తీరా గుర్తించే సరికి ఆలస్యం అవుతోంది.

ఓ యూట్యూబర్ ఫ్యామిలీ తాజాగా తన ఇంట్లో ఎంత డబ్బు ఉందో సోషల్ మీడియా రీల్స్ ద్వారా బహిర్గతం చేసింది. డబ్బు మొత్తం బీరువాలో నుంచి తీసి చూపిస్తూ ఇంట్లో కుమ్మరించింది. తన కూతురి మీద నోట్ల వర్షం కురిపిస్తూ డ్యాన్సులు చేసింది. ఇంకేముంది ఆ వీడియో ఎవరి కంట పడకూడదో వారికంట పడింది. డబ్బును మాయం చేసేందుకు దొంగలు ముహూర్తం పెట్టారు.భార్యాభర్తలు ఇంట్లో లేనిసమయంలో వచ్చి మొత్తం దోచుకుని వెళ్లారు.

వివరాల్లోకివెళితే.. కన్యాకుమారి జిల్లా నాగర్‌కోవిల్ సమీపంలోని తమ్మట్టుకోణం ప్రాంతంలో వినోద్ కుమార్ ఓ ప్రముఖ యూట్యూబర్ ఉన్నాడు.తన భార్య మధుమితతో కలిసి యూట్యూబ్ వీడియోలు, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ పోస్ట్ చేస్తూ ఉండేవాడు. అతని భార్యకు సైతం సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది.దీంతో ఇద్దరూ కలిసి వీడియోలు, రీల్స్ చేస్తూ డబ్బులు సంపాదించేవారు.

ఈ క్రమంలోనే మధుమిత ఓ రోజు తన ఇంట్లో ఉన్న డబ్బు మొత్తాన్ని మంచంపై పరిచింది. కట్టలు కట్టలుగా డబ్బులు ఉన్న వీడియోలను పోస్త్ చేసింది.ఆ వీడియోలు దొంగల ముఠా కంటపడటంతో వారి ఇంట్లో చోరీ చేయాలని ప్లాన్ చేశారు.భార్యాభర్తలిద్దరూ ఇంటికి తాళం వేసి షాపింగ్‌కి వెళ్లిన సమయంలో సైలెంట్‌గా వెనుక డోర్ నుంచి ఇంట్లోకి చొరబడి కిలో బంగారం, రూ.1 కోటి నగదు ఎత్తుకెళ్లారు.

ఇంటికి తిరిగొచ్చి చూసే సరికి దొంగతనం జరిగిన విషయాన్ని గుర్తించారు. దీంతో బాధితు కుటుంబం వెంటనే పోలీసులను ఆశ్రయించింది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దొంగలను గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. అందుకే సంసారాన్ని బయటపడేసుకోకూడదని, అతి చేసే అనుభవించాల్సి వస్తుందని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.

#youtuber family#reels#videos#robbery#viral#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి