International

హెచ్‌-1బీ వీసాలపై కొత్త రూల్‌.. కలిసిపోయిన 22 అమెరికా రాష్ట్రాలు!

రచన: Mamatha puppala••4 నిమిషాల పఠనం

అమెరికాలో హెచ్‌-1బీ(H-1B) వీసా పిటిషన్లపై ఏకంగా 103,265డాలర్ల (సుమారు రూ. 95 లక్షలు) భారీ ఫీజు విధించాలని ట్రంప్ యాజమాన్యం చేసిన నూతన ముసాయిదా ప్రతిపాదనపై యూఎస్ రాజకీయంలో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ కాలిఫోర్నియా, న్యూయార్క్, న్యూజెర్సీ, టెక్సాస్ సహా మొత్తం 22 అమెరికా రాష్ట్రాల అటార్నీ జనరల్స్ ఏకమయ్యారు.

 అమెరికాలో హెచ్‌-1బీ(H-1B) వీసా పిటిషన్లపై ఏకంగా 103,265డాలర్ల (సుమారు రూ. 95 లక్షలు) భారీ ఫీజు విధించాలని ట్రంప్ యాజమాన్యం చేసిన నూతన ముసాయిదా ప్రతిపాదనపై యూఎస్ రాజకీయంలో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ కాలిఫోర్నియా, న్యూయార్క్, న్యూజెర్సీ, టెక్సాస్ సహా మొత్తం 22 అమెరికా రాష్ట్రాల అటార్నీ జనరల్స్ ఏకమయ్యారు.

 ఈ ప్రతిపాదన అత్యంత హానికరం, చట్టవిరుద్ధం అని పేర్కొంటూ యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (USCIS)కు వారు సంయుక్తంగా అధికారిక నిరసన లేఖను పంపించారు. ఈ భారీ మొత్తాన్ని సాధారణ రుసుముగా కాకుండా 'చట్టవిరుద్ధమైన పన్ను'గా అటార్నీ జనరల్స్ అభివర్ణించారు. అమెరికా కాంగ్రెస్ (పార్లమెంట్) ఆమోదం లేకుండా కేవలం పరిపాలనాపరమైన నిబంధనల ద్వారా ఇలాంటి భారీ పన్నును విధించే అధికారం ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు.

 ఒకవేళ ఈ రుసుము అమలులోకి వస్తే, ఇప్పటికే ఉపాధ్యాయులు, వైద్యులు, నర్సులు, సాంకేతిక నిపుణుల కొరతతో బాధపడుతున్న ప్రభుత్వ సంస్థలు, ఆసుపత్రులు, విద్యాసంస్థలపై కోలుకోలేని భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రయత్నాన్నే గతంలో అధ్యక్షుడి ఉత్తర్వుల రూపంలో తెచ్చేందుకు ప్రయత్నించగా, 2026 జూన్‌లో ఫెడరల్ కోర్టు దానిని రాజ్యాంగ విరుద్ధమని కొట్టివేసిందని అటార్నీ జనరల్స్ గుర్తుచేశారు. ముసాయిదా నిబంధనగా తెచ్చిన ప్రస్తుత ప్రతిపాదన కూడా న్యాయపరంగా నిలబడదని, దీనివల్ల విదేశీ నిపుణులపై ఆధారపడే అమెరికన్ కంపెనీలు దెబ్బతింటాయని హెచ్చరిస్తూ వెంటనే ఈ ముసాయిదాను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

 విదేశీ నిపుణుల రూపంలో తక్కువ వేతనాలకే పనిచేయించుకుంటూ అమెరికన్ల ఉద్యోగాలను కొల్లగొడుతున్నారనే నెపంతో ట్రంప్ ప్రభుత్వం ఈ రుసుమును ప్రతిపాదించినప్పటికీ, విపరీతమైన సిబ్బంది కొరతతో సతమతమవుతున్న అమెరికా స్థానిక రాష్ట్రాలు మాత్రం ఈ నిర్ణయాన్ని తీవ్రంగా నిరసిస్తున్నాయి. ప్రస్తుతం సేకరిస్తున్న ప్రజాభిప్రాయ సేకరణ దశలోనే రాష్ట్రాలు తమ అభ్యంతరాలను బలంగా వ్యక్తం చేయడంతో ఈ వ్యవహారం మరోసారి ఫెడరల్ కోర్టు గుమ్మం తొక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.

#H1BVisa#TrumpAdministration#USCIS#H1BFeeHike#ImmigrationNews#USStatesProtest#TechJobs
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి