Keerthy Suresh: సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమా విడుదలకు ముందే వివాదాల్లో చిక్కుకోవడం కొత్తేమీ కాదు. అయితే ప్రస్తుతం దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ రూపొందించిన ‘డొరొతి’ చుట్టూ వినిపిస్తున్న బాయ్‌కాట్ డిమాండ్లు సోషల్ మీడియాలో ఆసక్తిని పెంచుతున్నాయి. సినిమాను చూడొద్దంటూ కొందరు నెటిజన్లు పోస్టులు పెడుతుండగా.. మరికొందరు మాత్రం సినిమాను సినిమాగా చూడాలంటూ పాజిటివ్‌గా మాట్లాడుతున్నారు. అయితే, ఇలా బాయ్‌కాట్ అని అనడానికి కారణం.. ఈ సినిమా క్లైమాక్స్ లో ఒక హీరో ట్రాన్స్ జెండర్ గా మారి.. ఇంకొక హీరోని పెళ్లి చేసుకునే సన్నివేశం సోషల్ మీడియానే షేక్ చేసింది.
కార్తీక్ సుబ్బరాజ్ సినిమాలకు సాధారణంగా ప్రత్యేకమైన టేకింగ్, విభిన్నమైన కథనం, డార్క్ థీమ్‌లు ఉంటాయనే పేరుంది. దీంతో ‘డొరొతి’పై కూడా ప్రేక్షకుల్లో మొదటి నుంచే అంచనాలు ఏర్పడ్డాయి. అయితే సినిమా కథ విషయంలో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. కార్తీక్ సుబ్బరాజ్ నుంచి ఇలాంటి సినిమాలను ఆశించడం లేదని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. కోలీవుడ్లో ఇకపై ఇలాంటి కంటెంట్ ఉన్న సినిమాలు గనక వస్తే చూడకూడదని కామెంట్స్ చేస్తున్నారు.
కథ బావున్నా..సన్నివేశాలే ఛండాలం!
కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో సనంత్, రిషికాంత్ ప్రధాన పాత్రల్లో కనిపించారు. 1990ల నాటి గ్రామీణ తమిళనాడు నేపథ్యంతో కథ సాగుతుంది. దీనికి, కుల వివక్షత.. హింస..లాంటి అంశాలతో పాటుగా పురుషాధిక్య భావజాలం వంటి బలమైన అంశాల చుట్టూ కథను నడిపించాడు కార్తీక్ సుబ్బరాజ్.
ఇక, ఈ సినిమా ఫస్టాఫ్ లో చక్కని విలేజ్ డ్రామాను చూపించాడు. ఆహ్లాదకరమైన గ్రామీణ వాతావరణం, అక్కడ నివసించే మనుషులు..వారి మధ్య సంబంధాలు, కుల రాజకీయాలు..ఇలా బలమైన అంశాల చుట్టూ సినిమా చాలా ఆసక్తికరంగా సాగుతుంది. అయితే, సెకండాఫ్ లో మాత్రం కథ పూర్తిగా ఊహించని మలుపు తిరుగుతుంది. ఇద్దరు మగాళ్లు ప్రేమించుకోవడం.. వారిమధ్య ఇంటిమేటెడ్ సీన్స్ ని దర్శకుడు చూపించడం తమిళ తంబీలకి నచ్చలేదు. దీంతో, ఇప్పుడు డొరొతి సినిమాను బాయ్‌కాట్ చేయమని హ్యాష్ ట్యాగ్స్‌తో న్యూస్ వైరల్ చేస్తున్నారు.












