Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఒకవైపు భారీ ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటూనే.. మరోవైపు తన అభిమానుల్లో ఆసక్తిని పెంచేలా కీలక అప్‌డేట్స్ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే ‘కాకా’ మూవీకి సంబంధించి మెగాస్టార్ ఇచ్చిన తాజా అప్‌డేట్ ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా టాకీ పార్ట్ 80 శారం పూర్తైందట. ఫస్టాఫ్ కంటెంట్ థమన్ చేతికి వెళ్ళినట్టుగా కూడా చిరు వెల్లడించారు.
ఇక, ‘కాకా’ అనే టైటిల్ వినిపించినప్పటి నుంచే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి మొదలైంది. ముఖ్యంగా మెగాస్టార్‌కు సంబంధించిన అప్‌డేట్ కావడంతో అభిమానులు మరింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా చిరంజీవి చేసిన వ్యాఖ్యలు సినిమాపై అంచనాలను మరింత పెంచేలా ఉన్నాయి.
ఈ సినిమా కథ, తన పాత్ర, మేకింగ్ గురించి మెగాస్టార్ చెప్పిన విషయాలు అభిమానుల్లో క్యూరియాసిటీని పెంచుతున్నాయి. సాధారణ కమర్షియల్ అంశాలతో పాటు కొత్త తరహా ట్రీట్‌మెంట్ ఉండబోతుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. అలాగే, బ్యాలెన్స్ షూట్ కేవలం 20 శాతం మాత్రమే మిగిలింది ఉందట. థమన్ ఫస్టాఫ్ కి బీజీఎం వర్క్ స్టార్ట్ చేసినట్టుగా చిరు చెప్పుకొచ్చారు. దీంతో ‘కాకా’లో చిరంజీవిని దర్శకుడు ఏ రేంజ్‌లో చూపించబోతున్నారన్న చర్చ మొదలైంది.
వాల్తేరు వీరయ్యా లాంటి మాసీవ్ హిట్ ఇచ్చిన దర్శకుడు బాబీ..ఈ సినిమాలో మెగాస్టార్‌ని నెక్స్ట్ లెవల్‌లో చూపించబోతున్నాడు. కె.సత్యం అనే పాత్రను అద్భుతంగా డిజైన్ చేసినట్టుగా ఇటీవల వచ్చిన ట్రీజర్‌తో హింట్ ఇచ్చారు. ఇక, ఈ సినిమాలో చిరు కూతురు పాత్రలో యంగ్ బ్యూటీ అనస్వవర రాజన్ నటిస్తుండగా, గెటప్ శ్రీను..సునీల్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. 2027, సంక్రాంతికి రిలీజ్ అని ఆల్రెడీ డేట్ ని కూడా ప్రకటించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ కెవిఎన్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది.










