క్రైమ్

UP : ఆమె ప్రేమ చూస్తే అతడు డబ్బు చూశాడు.. చివరకు!

రచన: Kumar•••4 నిమిషాల పఠనం

ప్రేమ పేరిట వేధింపులు, మోసాలు, హత్య ఉదంతాలు క్రమంగా పెరుగుతున్నాయి.ఏళ్లుగా ప్రేమించకుంటున్నామని ఇంట్లో చెప్పే ధైర్యం జంటలకు ఉండటంలేదు. బయటకు మాత్రం అమర ప్రేమికులగా నటిస్తున్నారు. ఫలితంగా పెళ్లి విషయం వచ్చేసరికి అబ్బాయి లేదా అమ్మాయి తిరస్కరించడం ఇటీవలి కాలంలో కామన్ అయ్యింది.

ప్రేమ పేరిట వేధింపులు, మోసాలు, హత్య ఉదంతాలు క్రమంగా పెరుగుతున్నాయి.ఏళ్లుగా ప్రేమించకుంటున్నామని ఇంట్లో చెప్పే ధైర్యం జంటలకు ఉండటంలేదు. బయటకు మాత్రం అమర ప్రేమికులగా నటిస్తున్నారు. ఫలితంగా పెళ్లి విషయం వచ్చేసరికి అబ్బాయి లేదా అమ్మాయి తిరస్కరించడం ఇటీవలి కాలంలో కామన్ అయ్యింది. నూటికి ఒకశాతం మాత్రమే ప్రేమించుకుని పెళ్లి చేసుకుంటున్న వారు ఉన్నారు. మిగతా జంటలు చివరి నిమిషంలో బ్రేకప్ చెప్పుకుని ఎవరి దారి వారు చూసుకోవడం లేదా ఒకరినొకరు మోసం చేయడం వంటి ఘటనలు వెలుగుచూస్తున్నాయి.

ఫలితంగా కొందరు బాధ భరించలేక ఆత్మహత్యలు పాల్పడుతుంటే.. పెళ్లిపేరిట ఒత్తిడి చేస్తున్నారని అవతలి వారిని అడ్డు తప్పించుకోవాలని చూస్తున్నారు.అందులో అమ్మాయి, అబ్బాయి ఇద్దరూ ఉంటున్నారు. చాలా కేసుల్లో పెళ్లి చేసుకోలేక, అమ్మాయి తరఫు నుంచి ఒత్తిడి భరించలేక అబ్బాయిలే హత్యలు చేస్తున్నట్టు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.తాజాగా ఇలాంటి ఘటనే మరొకటి వెలుగుచూసింది.

పెళ్లి చేసుకోమన్నందుకు ప్రియురాల్ని చంపి ట్యూబ్‌వెల్‌లో బాడీ పడేసి ఆమె వద్దనున్న డబ్బులతో ప్రియుడు పరార్ అయ్యాడు. ఉత్తరప్రదేశ్‌లోని కస్‌గంజ్‌లో ఈ దారుణ ఘటన చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకివెళితే.. నేహాఖాన్ (18), సమీర్ ఇద్దరూ ఇష్టపడ్డారు. పెళ్లిచేసుకోవాలని భావించారు. అయితే, ఈ క్రమంలో సమీర్ మైండ్‌లో ఓ క్రిమినల్ ఐడియా మెదిలింది. ప్రియురాలిని పెళ్లి చేసుకోవడం కంటే ఆమె వద్ద ఉన్న డబ్బులు, నగల మీద అతని కోరిక పుట్టింది.

వాటిని ఎలాగైనా చేజిక్కించుకోవాలని భావించాడు. ఈ క్రమంలోనే ఇంటి నుంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకుందామని నేహా ఖాన్‌(18)ను ప్రియుడు సమీర్ నమ్మించాడు. ఇంట్లో ఉన్న బంగారంతో పాటు నగదు కూడా తీసుకురావాలని చెప్పడంతో నేహా సరే అని చెప్పింది.ప్రియుడు చెప్పినట్టే రాత్రి టైంలో రూ.1.35 లక్షల నగదుతో పాటు బంగారాన్ని తీసుకొని వచ్చింది.

అయితే, డబ్బు, బంగారం తీసుకొని మరో ముగ్గురు ఫ్రెండ్స్ సాయంతో నేహాను సమీర్ హత్యచేశాడు.అనంతరం మృతదేహాన్ని పొలం సమీపంలోని ట్యూబ్‌వెల్‌లో పడేసి నిందితులు పరార్ అయ్యారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. సమీర్ చేసిన హత్యలో పాలు పంచుకున్న నిందితులను అర్షద్, అర్సలాన్, అమిత్‌లుగా గుర్తించారు.

#lover murder#cash and gold#four criminals#Up#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి