National

National :ఉగ్రదేశం నన్ను ప్రశ్నిస్తోంది.. పాక్ జర్నలిస్టుకు జై శంకర్ దిమ్మతిరిగే కౌంటర్

రచన: Kumar••4 నిమిషాల పఠనం

భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు ఇప్పుడు కాస్త తగ్గినా దౌత్యపరంగా మాత్రం ఆ వైరం కొనసాగుతూనే ఉంది. ప్రపంచ వేదికల మీద ఇండియా పరువు తీయాలని ప్రయత్నించిన ప్రతిసారి దాయాది పాక్‌కు ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. దేశంలో అశాంతిని క్రియేట్ చేయడానికి ఓ ఉగ్రవాదులను ఉసిగొల్పుతున్న పాకిస్తాన్..

భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు ఇప్పుడు కాస్త తగ్గినా దౌత్యపరంగా మాత్రం ఆ వైరం కొనసాగుతూనే ఉంది. ప్రపంచ వేదికల మీద ఇండియా పరువు తీయాలని ప్రయత్నించిన ప్రతిసారి దాయాది పాక్‌కు ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. దేశంలో అశాంతిని క్రియేట్ చేయడానికి ఓ ఉగ్రవాదులను ఉసిగొల్పుతున్న పాకిస్తాన్.. మరోవైపు పంజాబ్ బోర్డర్‌లో పెద్దఎత్తున డ్రగ్స్‌ను దేశంలోకి చొప్పిస్తోంది. ఇక్కడి యువతను మత్తుకు బానిసలుగా చేయాలని కుట్రలు పన్నుతోంది.

దీనంతటికీ చెక్ పెట్టేందుకు భారత ప్రభుత్వం దృఢసంకల్పంతో పనిచేస్తోంది. అక్రమ చొరబాట్లను పట్టుకుని దేశం నుంచి పంపించేందుకు దేశంలో ‘ఎస్ఐఆర్’ అమలు చేసింది.మరోవైపు బోర్డర్ సెక్యూరిటీని టైట్ చేసింది. పంజాబ్ బోర్డర్‌లో ఇటీవల లాంచ్ చేసిన కొత్త శాటిలైట్ ద్వారా 24 గంటల నిఘాను ఉంచింది. ఉగ్రవాదులు, డ్రగ్స్ బోర్డర్‌లోకి ఎవరైనా తీసుకురావడానికి ప్రయత్నిస్తే వారిని వెంటనే ఎలిమినేట్ చేసే యంత్రాంగాన్ని మోహరించింది.

పాక్ పన్నాగాలు వరుసగా విఫలం అవుతున్న తరుణంలో అంతర్జాతీయ వేదికల మీద భారత్ పరువు తీయాలని ప్రయత్నించే వారి కుట్రలను విదేశాంగశాఖ తిప్పికొడుతోంది. తాజాగా యూఎన్‌జీవో 81వ సమావేశాల్లో భాగంగా న్యూయార్క్‌లో జరిగిన మీడియా మీట్‌లో భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఓ పాక్ జర్నలిస్ట్ ‘పాకిస్తాన్‌లో భారత్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడాన్ని మీ దేశం ఎప్పుడు ఆపుతుంది’ అని ప్రశ్నించగా.. ఆయన స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

‘ఒక ఉగ్రవాద దేశమే నన్ను ఈ ప్రశ్న అడుగుతోంది. కమాన్’ అని ఘాటు జవాబు ఇచ్చారు. జై శంకర్ సమాధానం విన్న యూఎన్‌లోని భారత శాశ్వత ప్రతినిధి పి.హరీష్ కల్పించుకొని..‘మీకు రావాల్సిన సమాధానం అత్యంత స్పష్టంగా, గట్టిగా లభించింది’ అని సదరు జర్నలిస్టుకు చెప్పారు.

కాగా, ఈ ఘటన జరగడానికి ఒక రోజు ముందు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ యూఎన్ భవనంలోకి ప్రవేశిస్తున్న టైంలో ఒక భారతీయ జర్నలిస్ట్ ఆయన్ను అడ్డుకుని ‘ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వడం మీరు ఎప్పుడు ఆపుతారు?’ అని ప్రశ్నించారు.దానికి ప్రతికారంగానే పాకిస్తాన్ జర్నలిస్టు.. జైశంకర్‌ను ఇరుకున పెట్టాలని చూడగా ఆయన నోరు మూయించాడు.

#jai shanker#pak journalist#counter answer#terroism#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి