SK 27: కోలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో మరో క్రేజీ కాంబినేషన్ తెరపై రాబోతోంది. టాలెంటెడ్ హీరో శివకార్తికేయన్, బ్యూటిఫుల్ హీరోయిన్ కయాదు లోహర్ జంటగా నటించనున్న కొత్త చిత్రం తాజాగా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. వరుసగా ఫ్లాప్స్ వస్తున్నా కూడా కయాదు మాత్రం మాంచి జోరు మీదుంది. ఇటీవల, నాని నటించిన ప్యారడైజ్ సినిమాలో హీరోయిన్‌గా నటించిన కయాదుకి వెంటనే తమిళ సినిమా ఛాన్స్ అంటే గొప్ప విషయం.
తమిళంలో స్టార్ హీరోగా వెలుగుతోన్న శివకార్తికేయన్ వరుస సినిమాలతో చాలా బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో ఆయన తదుపరి ప్రాజెక్ట్‌కు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్ వచ్చింది. దర్శకుడు రామ్‌కుమార్ బాలకృష్ణన్ తెరకెక్కించనున్న ఈ కొత్త చిత్రం తాజాగా సంప్రదాయ పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ సత్యజ్యోతి ఫిలింస్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌ను #ఎస్‌కె27గా పిలుస్తున్నారు.
శివ కార్తికేయన్‌కి తెలుగు ప్రేక్షకుల్లోనూ మంచి క్రేజ్ ఉంది. అతను తమిళంలో నటించిన చాలా సినిమాలు తెలుగులోనూ డబ్బింగ్ వెర్షన్ రిలీజై ఆకట్టుకుంటున్నాయి. సూర్య, ధనుష్, కార్తి, మలయాళ హీరో దుల్కర్ సల్మాన్‌ల మాదిరిగా స్ట్రైట్ సినిమాలు చేయకపోయినా కూడా అటు తమిళంలో అలాగే ఇటు తెలుగులోనూ బాగా మార్కెట్ ఏర్పర్చుకున్నాడు. ఈ నేపథ్యంలో ఇక్కడ కూడా శివ కార్తికేయన్‌కి ఆదరణ బాగా లభిస్తోంది.
ఇక, ఈ సినిమాకు రామ్‌కుమార్ బాలకృష్ణన్ దర్శకత్వం వహిస్తున్నారు. పూజా కార్యక్రమాలతో సినిమా షూటింగ్‌కు శ్రీకారం చుట్టినట్లుగా నిర్మాణ సంస్థ వెల్లడించింది. చిత్రానికి సంబంధించిన కథ, జానర్, టైటిల్ వంటి కీలక వివరాలను మాత్రం మేకర్స్ ఇంకా పూర్తిగా ప్రకటించాల్సి ఉంది. కాగా, రామ్‌కుమార్ 'పార్కింగ్' సినిమాతో అటు ప్రేక్షకులను ఇటు మేకర్స్‌ను బాగా ఆకట్టుకున్నాడు.
ఈ సినిమాలో కయాదు లోహర్ హీరోయిన్‌గా నటించనుండటం మరో ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతోంది. ఇప్పటికే, మారి సెల్వరాజ్ దర్శకత్వంలో ఓ తమిళ సినిమాను చేస్తోమి కయాదు. ఇక, ఆమె నటించిన ‘డ్రాగన్’, ‘ది ప్యారడైజ్’ వంటి సినిమాలతో తెలుగు, తమిళ ప్రేక్షకుల్లో బాగా గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సౌత్‌లో ఉన్న యంగ్ హీరోయిన్‌లో వరుసగా అవకాశాలు అందుకుంటోంది కయాదు. ఈ క్రమంలోనే ఇప్పుడు శివకార్తికేయన్‌కు జోడీగా కనిపించే అవకాశాన్ని అందుకుంది.









