సినిమా

Megastar-Kaaka: 'కాకా' డబ్బింగ్ మొదలు..బాబీ స్పీడ్ మాములుగా లేదు..

రచన: Anshu••5 నిమిషాల పఠనం

Megastar-Kaaka: బాబీ డైరెక్షన్‌లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ‘కాకా’ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించిన పనులు శరవేగంగా పూర్తవుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా చిత్రబృందం డబ్బింగ్ కార్యక్రమాలను ప్రారంభించింది. ఈ విషయాన్ని తెలుపుతూ నిర్మాణ సంస్థ ఎక్స్ ద్వారా వీడియోను రిలీజ్ చేసింది. ఈవీడియో దర్శకుడు బాబీ..కీలక పాత్రలో నటించిన యంగ్ బ్యూటీ అనస్వర రాజన్ సహా చిత్ర యూనిట్ కూడా ఉన్నారు.

ఇక, కాకా సినిమా డబ్బింగ్ వర్క్ ప్రారంభం కావడంతో సినిమాకు సంబంధించిన నిర్మాణానంతర కార్యక్రమాలు కూడా వేగవంతం కానున్నాయి. మూవీలో నటించిన నటీనటుల డైలాగ్స్‌కు తుది మెరుగులు దిద్దడంతో పాటు, సౌండ్ డిజైన్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, రీ-రికార్డింగ్ వంటి పనులు కూడా వరుసగా పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది. 2027, జనవరి 13 సంక్రాంతి పండుగ సందర్భంగా కాకా చిత్రం భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది.

మెగాస్టార్ చిరంజీవి నుంచి రాబోతున్న సినిమా కావడంతో ‘కాకా’పై ఇప్పటికే అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా సినిమాలో చిరంజీవి పాత్ర ఎలా ఉండబోతోంది? కథ ఏ నేపథ్యంలో సాగుతుంది? ఆయనను దర్శకుడు ఏ తరహా పాత్రలో చూపించబోతున్నారు? అనే విషయాలు ఆసక్తిని పెంచుతున్నాయి. ఇటీవల వచ్చిన టీజర్ లో చిరు పాత్ర రివీల్ అయినప్పటికీ..ఆయన ఓ ఈవెంట్‌లో కాకా సినిమా విషయాలు చెప్పడంతో విపరీతమైన క్యూరియాసిటీ పెరుగుతోంది.

ఇక, తాజాగా డబ్బింగ్ పనులు ప్రారంభం కావడంతో త్వరలోనే సినిమా నుంచి మరిన్ని కీలక అప్‌డేట్స్ వచ్చే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా ట్రైలర్, పాటలు, రిలీజ్ డేట్‌కు సంబంధించిన ప్రకటనల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మొత్తానికి ‘కాకా’ డబ్బింగ్ వర్క్ స్టార్ట్ కావడంతో మెగాస్టార్ అభిమానుల్లో జోష్ మరింత పెరిగింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులను త్వరగా పూర్తి చేసి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. ఇక రాబోయే రోజుల్లో ‘కాకా’ నుంచి ఎలాంటి సర్‌ప్రైజ్‌లు వస్తాయో చూడాలి. కాగా, అగ్ర నిర్మాణ సంస్థ కెవిఎన్ ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ఇటీవల, ఈ సంస్థ నుంచి వచ్చిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద తీవ్ర నష్టాలను మిగిల్చాయి. దాంతో, మేకర్స్ ని ఇప్పుడు నష్టాల నుంచి కాపాడే బాధ్యత కాకా చిత్రం మీదే ఉంది.

#Megastar Chiranjeevi#Kaaka#Bobby#Anaswara Rajan
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి